పొరుగు దేశాల్లో భారీ వసూళ్లతో రఫ్ఫాడిస్తున్న కల్కి?

Purushottham Vinay
పొరుగు దేశాల్లో భారీ వసూళ్లతో రఫ్ఫాడిస్తున్న కల్కి?

 

కల్కి సినిమాకి వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో ఏకంగా రూ. 595 కోట్లకు పైగా వచ్చేసాయి. కల్కి కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. కెనడా, అమెరికా దేశాల్లో కల్కి సినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. అక్కడ ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 12 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.అంటే 110 కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో రాబట్టింది. ఇంకా బలంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మన్స్ ఇస్తుంది.ఇక కల్కి ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో ఆశ్చర్యకరంగా అనిపించే విషయం ఏమిటంటే.. రష్యా, శ్రీలంక, జర్మనీ లాంటి దేశాల్లో ఈ సినిమా కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. దాంతో ప్రపంచవ్యాప్తంగా నిర్మాత సీ అశ్వినీదత్‌కు కల్కి 2898 ఏడి వసూళ్లతో కాసుల పంట పండుతున్నది.కల్కికి సినిమాకు రష్యాలో కూడా ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతున్నది.


ఈ దేశంలో అమితాబ్, ప్రభాస్‌కు భారీ ఫాలోయింగ్ ఉండటంతో అనూహ్యమైన వసూళ్ళని సాధిస్తున్నది. రష్యాలో ఈ సినిమా 1.24 మిలియన్ రష్యన్ రూబుల్స్ అంటే.. సుమారుగా 1 కోటి రూపాయలు రాబట్టడం రికార్డుగా మారింది.ఇక శ్రీలంకలో కూడా కల్కి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. తొలి రోజు ఏకంగా 32 లక్షల శ్రీలంక రూపాయలు, రెండో రోజు 41 లక్షలు, మూడో రోజు 57 లక్షలు, నాలుగో రోజు 53 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఏకంగా 1.8 కోట్ల శ్రీలంక రూపాయలు వసూల చేసింది.ఇక యూకేలో కూడా కల్కి 2898 ఏడి మూవీ హవా కొనసాగుతున్నది. ఈ సినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తున్నది.యూకేలో ఈ సినిమా ఏకంగా 1 మిలియన్ పౌండ్స్ వసూలు చేసింది. అమెరికాలో 12 మిలియన్లతో కలిపి ఓవర్సీస్ మార్కెట్‌లో మొత్తంగా 18 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు చేరువైంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈజీగా 20 మిలియన్ డాలర్లని క్రాస్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: