సూపర్ స్టార్ కృష్ణ కూతుర్ని దత్తత తీసుకున్న కృష్ణంరాజు.. కారణమేంటి..?

lakhmi saranya
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే రెబల్ స్టార్ కృష్ణ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణ రాజు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. 1960 లో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1966 లో కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న కృష్ణ, కృష్ణంరాజు ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు కొన్ని ఆసక్తికర విషయాలని రివిల్ చేశారు. ఆయన చేసినా కొన్ని కామెంట్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

కృష్ణ నాకు మంచి మిత్రుడు..మంచి మనసుతో పాటు పౌరుషం కూడా ఉన్న వ్యక్తి కృష్ణ అని కృష్ణంరాజు అన్నారు. వాస్తవానికి నేను రెబల్ స్టార్ కాదు. ఆయనే రెబల్ ప్రొడ్యూసర్ అని కృష్ణంరాజు కీతాబిచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమా తీసి ఇది తెలుగు చిత్ర పరిశ్రమ పోడెన్షియల్ అని నిరూపించిన వ్యక్తి కృష్ణ అని కృష్ణంరాజు కోనియాడారు. అదేవిధంగా సిల్వర్ స్కీన్ పై కృష్ణ చేసిన సాహసాలు, సాధించిన ఘనతల గురించి కూడా కృష్ణంరాజు తెలిపారు. అదే వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.

కృష్ణ కి, నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది..ఎంత అండే..కృష్ణ గారి ఆఖరి కుమారైని నేను దత్తత తీసుకుంటా అని అడిగా, సరే అని అన్నాడు అంటూ కృష్ణంరాజు నవ్వుతూ తెలిపారు. మహేష్ బాబుతో నేను బాబి సినిమా చేస్తానని అడిగా..అందుకు కూడా సరే అని అన్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటారు. కృష్ణ గారి విజయం వెనుక ఉన్న మహిళ విజయ్ నిర్మల గారు. నాకు నా భార్య శ్యామల అని కృష్ణంరాజు తెలిపారు. కృష్ణ కొన్ని సందర్భాల్లో ఏడాదికి 14 సినిమాలు కూడా చేశారు. కృష్ణ నా పక్కన ఉన్నప్పుడు ఒక వ్యక్తి.. ఇన్నేసి సినిమాలు చేస్తున్నారు.. అలసట అనిపించిందా అని అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: