సచ్చింది గొర్రె! కల్కి స్పీడుకి హాలీవుడ్ మూవీ బ్రేక్?

Purushottham Vinay
సచ్చింది గొర్రె! కల్కి స్పీడుకి హాలీవుడ్ మూవీ బ్రేక్?  


రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో  ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.


గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ టికెట్స్ పైగా అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది.. ఇక ఇండియాలో సుమారుగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా మూడో రోజు 415 కోట్ల కలెక్షన్స్ పైగా వసూలు చేసి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక నార్త్ అమెరికాలో కూడా సాలిడ్ గా వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా యానిమల్, జవాన్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలని బీట్ చేసేస్తోంది. అయితే కల్కి సినిమా స్పీడ్ కి హాలీవుడ్ సినిమా "ఏ క్వయిట్ ప్లేస్" సినిమా బ్రేక్ వెయ్యనుంది. ఈ నేపథ్యంలో USA లో కల్కికి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లని తగ్గించి ఈ సినిమాకి పెంచనున్నారు.దాంతో కచ్చితంగా కల్కి సినిమాకి వసూళ్లు తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: