మూడోసారి ఆ క్రేజీ డైరెక్టర్ తో.. వెంకీ మామ సినిమా?

praveen
సాధారణంగా హీరోలు ఎంతో మంది దర్శకులతో సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోల కాంబినేషన్ మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ కాంబినేషన్లో ఎన్నిసార్లు సినిమాలు వచ్చిన అవి బ్లాక్ బస్టర్ అవుతూ ప్రేక్షకులను మెప్పించ గలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ప్రేక్షకులందరికీ మెప్పించిన క్రేజీ కాంబినేషన్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో అటు బాలయ్య బోయపాటి కాంబినేషన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.

 అచ్చంగా ఇలాగే టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ కి సైతం ఒక డైరెక్టర్ తో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. హాస్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో ఇప్పుడు వరకు ఏకంగా రెండు సినిమాలు తీస్తాడు ఎఫ్2, ఎఫ్3 అనే సినిమాలతో వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ను సరికొత్తగా చూపించి ప్రేక్షకులందరికీ కూడా మెప్పించడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

 ఇక ఈ రెండు సినిమాలు తర్వాత అనిల్, వెంకీ మామ కాంబినేషన్ అందరికీ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పటికే విరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ముచ్చటగా మూడోసారి జతకట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమం రేపు ఉదయం 11:16 గంటలకు లాంఛనంగా ప్రారంభం కానుంది అన్నది తెలుస్తుంది. ఎస్విసి బ్యానర్లో రాబోతున్న 58వ సినిమాను శిరీష్ నిర్మించబోతున్నారట. ఈ క్రమంలోనే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: