టాప్ 5 టాలీవుడ్ బెస్ట్ మూవీ షాట్స్.. నంబర్ వన్ ప్లేస్ లో ఆ స్టార్ హీరో మూవీ..!!

Anilkumar
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ సత్తా ఏంటో చూపిస్తున్నారు తెలుగు దర్శకులు. ఇప్పటికే బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకు వెళ్ళాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఒకప్పుడు సినిమాలు అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూసే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. ఒకప్పటి దర్శకులు ఏమో కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న కొత్త దర్శకులు మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ కథలను తీసుకువస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలతో అద్భుతంగా సినిమాలను తీస్తున్నారు. అలా ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే గత ఐదేళ్లలో టాలీవుడ్

 సినిమాల్లో కనిపించిన బెస్ట్ ఎలివేషన్ షాట్స్ అంటే టక్కున  కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక వాటిలో చాలామంది స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి  సినిమా ముందు వరుసలో ఉంది. ఇక ఈ సినిమాలో ఎలివేషన్ షాట్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. విజువల్ ప్రెజెంటేషన్ అత్యద్భుతంగా ఉంది .ఇక ఈ సినిమా తరువాత ఈ ఏడాది విడుదలైన హనుమాన్ సినిమా సైతం ఇదే స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఆంజనేయుడి విగ్రహం అలాగే వాటర్ఫాల్ ఎలివేషన్ చూసి అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ

 సినిమా తీసిన విధానానికి అందరూ డైరెక్టర్ ను మెచ్చుకున్నారు. ఆ తరువాత బాలకృష్ణ అఖండ సినిమా అని చెప్పాలి. ఇక ఇందులో విలన్ గ్యాంగ్ తో గుడి దగ్గర యుద్ధం చేసినప్పుడు రథం చక్రాన్ని తీసి బాలయ్య చేసే ఫైట్ షార్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు అఖండ సినిమా అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కూడా అదే. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఫారెస్ట్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ చేసిన ఫైట్ సన్నివేశం. ఇక ఈ ఫైట్ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. అలా ఈ ఐదు సినిమాలు బెస్ట్ మూవీ షాట్ అని చెప్పొచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: