" స్టెప్పమార్" సాంగ్ లిరికల్ షీట్ విడుదల చేసిన 'డబల్ ఇస్మార్ట్' టీమ్..!

murali krishna
రామ్ పోతినేని  హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’  మూవీ వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ ఆ మూవీని బాగా ఆదరించారు. రామ్ పోతినేని మార్కెట్ ను కూడా డబుల్ చేసిన సినిమా ఇది. అంతేకాదు వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడంతో, ఆయనకు అప్పటివరకు ఉన్న అప్పులు అన్నీ తీరిపోయాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు.మొత్తానికి ‘డబుల్ ఇస్మార్ట్’  పేరుతో అది పట్టాలెక్కడం.. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ  అందించిన ట్యూన్.. ‘ఇస్మార్ట్ శంకర్’ లోని ‘ఇస్ ఇస్ ఇస్మార్టే’ పాటని గుర్తు చేసింది అని చెప్పాలి. ‘ఇస్మార్టు శంకరే.. ఏక్y దమ్ డేంజరె.. ఔర్ ఏక్ బార్ ఆయారే .. బేజారె’ అంటూ అనురాగ్ కులకర్ణి, సాహితీ ఎంతో జోష్ తో ఈ పాటని పాడారు.ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని స్టెప్పమార్ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సాంగ్ యొక్క లిరికల్ షీట్ ని విడుదల చేసింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: