సూపర్: వరలక్ష్మి పెళ్లి వేడుకలలో రచ్చ లేపుతున్న రాధిక-శరత్ కుమార్..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయినా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ సుపరిచితమే.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కంటే విలన్ పాత్రలోనే అందరిని ఆకట్టుకుంది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. అప్పటి నుంచి ఎక్కువగా నెగిటివ్ రోల్ పాత్రలలోనే నటిస్తోంది. ఈ ఏడాది వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్ చిత్రంతో మంచి విజయాన్ని కూడా అందుకున్నది. అభిమానులు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూసే పెళ్లి కూడా ఈరోజే చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది.

గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ముంబై కి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్ దేవ్ తో దాదాపుగా 9 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నదట. రీసెంట్ గా పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న వరలక్ష్మి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా అట్టహాసంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వరలక్ష్మి మెహంది వేడుకలు సంబంధించి వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ఈ వేడుకలలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిదండ్రులు రాధిక, శరత్ కుమార్ ఆనందంతో స్టెప్పులెస్తు తెగ సందడి చేస్తూ ఉన్నారు. మెహందీ వేడుక వద్దే అతిథులతో కలిసి డాన్స్ చేస్తూ అలరించిన వీరు.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన విజయ్ దళపతి సినిమా పాటకి డాన్సులు వేయడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన అభిమానుల సైతం వరలక్ష్మి  దంపతులకు కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి ఫోటోలను, వీడియోలను స్వయంగా షేర్ చేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: