ఏపీ : మాజీ సీఎం జగన్ కొత్త లుక్ గురూ...?

FARMANULLA SHAIK
మాజీ సీఎం అయ్యారు జగన్. ఆయన తాడేపల్లికి దూరంగా అధికారానికి చాలా దూరంగా ఉండడం ఇటీవల కాలంలో ఒక విశేషం. జగన్ బెంగళూరు లోని తన ఇంట్లో వారానికి పైగా ఉంటూ వస్తున్నారు. ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓటమి అనే భారీ బాధ నుంచి ఉపశమనం పొందేందుకే జగన్ ఈ విధంగా బెంగళూరు వెళ్లారు అని కూడా అంటున్నారు. జగన్ పులివెందులలో పర్యటించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తరువాత మాత్రం జగన్ గురించిన భోగట్టా కానీ పిక్స్ కానీ ఎక్కడా లభించలేదు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఉంటున్నారు అని మాత్రమే సమాచారం ఉంది.ఇదిలా ఉంటే తాజగా ఒక పిక్ అయితే సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. జగన్ వైట్ పైజామా బ్లాక్ పాంటుతో కనిపించారు. పైగా ఆయన చెప్పులు కూడా వెరైటీగా ఉన్నాయి. దాంతో జగన్ స్టైల్ మార్చారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. బెంగళూరులోని ఫాం హౌస్ లోని ఫోటోగా దానిని చెబుతున్నారు. అయితే ఇది ఫేక్ ఫోటోనా అన్న చర్చ సాగుతోంది కానీ కాదేమో అని కూడా అంటున్నారు. ఇక జగన్ పాదయాత్ర నుంచి కూడా ఖాకీ పాంటూ వైట్ షర్ట్ తో కనిపించేవారు. అదే ఆయన యూనీఫారం డ్రెస్ కోడ్ గా ఉండేది.సీఎం గా అయిదేళ్ళూ కూడా ఆయన అలాగే కనిపించారు. అయితే బెంగళూరు లో మాత్రం ఆయన డ్రెస్ కూడా మారింది అని అంటున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో కనిపించారు. అది కూడా పొడవాటి పైజామాతో మొత్తం మూడొంతులు కప్పేస్తూ ఉన్నది ధరించారు. ఇక చెప్పులు కూడా నల్లటి రంగులోని ఒక సాధారణమైనవి ధరించారు. ఈ పిక్ లో జగన్ చిరునవ్వుతో కనిపించినా ఆ నవ్వులో వెలుగులు అయితే పెద్దగా లేవు అనే అంటున్నారు.

సీఎం కాదు మాజీ సీఎం అన్న ట్యాగ్ ని భరించడం బహు కష్టం. దాంతో బాధ నుంచి ఉపశమనం పొందే క్రమంలో చిందించిన నవ్వుగానే ఉంది అంటున్నారు. మొత్తానికి జగన్ ఓటమిని జీర్ణించుకున్నట్లుగా అయితే కనిపిస్తున్నారు. అయితే ఆయన డ్రెస్ కోడ్ మారింది. ఇక మీదట బ్లాక్ అండ్ వైట్ తో కనిపిస్తారా లేక అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పటి మాదిరిగా వివిధ రంగుల షర్టులను ధరిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి ఇవాళ మాజీ సీఎం జగన్ తాడేపల్లికి రానున్నారు. మూడు గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు. తొమ్మిది రోజుల తర్వాత బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి రానున్నారు. గత నెల 22న పులివెందులకు వెళ్లిన జగన్.. 2 రోజుల పాటు పులివెందులలోనే కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యారు. ఆ తరువాత జూన్ 24న బెంగళూరుకు వెళ్లారు. వారం రోజులపాటు బెంగళూరులోనే ఉన్నారు.అయితే, తాడేపల్లిలోని జగన్‌ ఇంటి చుట్టూ చెకింగ్ గేట్స్ ను అధికారులు తొలగించారు. తాడేపల్లి రోడ్డును ఓపెన్‌ చేయడంతో జగన్‌ ఇంటి రోడ్డు వైపు సామాన్యులకు, వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. తాజాగా జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను నిలిపివేయకుండా కట్టడి చేసే టైర్‌ కిల్లర్లు, హైడ్రాలిక్‌ బుల్లెట్లను, చెక్‌పోస్టును అధికారులు తీసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: