ఆస్కార్ ఆకాడమీలో భారతీయుల హవా !

Seetha Sailaja
ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలొ నిర్మాణం అయ్యే సినిమాలకు అత్యుత్తమ పురస్కారాలు అంటే అది ఆస్కార్ అవార్డులు మాత్రమే. తమ సినిమాలకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే చాలు ఒక్కరోజులో ఆసినిమాలో నటించిన నటీనటులు దర్శకులు ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రెటీలుగా మారిపోతారు.

చాల సంవత్సరాలు ఆస్కార్ ఆకాడమీలో తెల్ల వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన భారతీయుల ఆదిపత్యం కూడ ఆస్కార్ అకాడమీ కార్యక్రమాలలో కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం జనవరిలో ప్రకటించే ఆస్కార్ అవార్డ్ విజేతలను సినిమాలను ఎంపిక చేసేందుకు ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంది. ఆ కమెటీ సూచనలు ఆస్కార్ అకాడమీ చాల ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.

రాబోయే సంవత్సరం జరగబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రముఖులతో ఒక ప్యానల్ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఆ ప్యానల్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 12 మంది ప్రముఖులు ఉండటం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ ఆర్ ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు దర్శకత్వం వహించిన రాజమౌళితో పాటు ఆపాటలోని కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రమారాజమోళికి కూడ ఆస్కార్ ఆకాడమీ కమెటీలో చోటు దక్కించు కోవడం వీరు చేసిన కృషి అనుకోవాలి.

ఈ లిస్టులో ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రితీష్ సిధ్వాని ప్రసిద్ధ కెమెరామెన్ రవి వర్మన్ శీతల్ శర్మ గంగూబాయ్ కటియావాడి డిజైనర్ తో పాటు రీమా దాస్ విలేజ్ రాక్ స్టార్స్ దర్శకురాలు నిషా పహుజా టు కిల్ ఏ టైగర్ మూవీకి దర్శకత్వం వహించిన ప్రముఖులతో పాటు డైరెక్టర్ హేమా త్రివేది జితేష్ పాండ్య ప్రేమ్ రక్షిత్ కూడ ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త అందరికీ తెలియడంతో ఆస్కార్ ఆకాడమీలో భారతీయుల హవా పెరిగిపోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తూ ఉండటంతో ఈ ఫిలిమ్ సెలెబ్రెటీల అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: