తెలుగు సినిమా పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దు గుమ్మలలో కాజల్ అగర్వాల్ , సమంత ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ల స్థాయికి విరిద్దరూ కూడా చేరుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ దాదాపు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తమ అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరికి అద్భుతమైన క్రేజ్ ఉంది. కానీ ఒక విషయం లో మాత్రం వీరు తమ అభిమానులను డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నారు. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? వరుస పెట్టి సినిమాలను చేయడంలో. వీరి కంటే తక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్లు కూడా వరుస పెట్టి సినిమాలను చేస్తూ వస్తున్నారు. వీరికి అద్భుతమైన క్రేజ్ ఉన్నా కూడా వరుస పెట్టి సినిమాలను చేయడం లేదు. ఎప్పుడో ఒక సినిమాను ఓకే చేస్తూ దానితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
దానితో వీరి అభిమానులు ఇంత అద్భుతమైన క్రేజ్ ఉన్న వీరిద్దరూ హీరోయిన్లు ఎందుకు వరుస పెట్టి సినిమాలను చేయడం లేదు. వీరు వరుస పెట్టి సినిమాలు చేస్తే వీరి సినిమాలకు అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఆఖరుగా భానుమతి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. సమంత ఒకరుగా ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక విడుదల అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమాలు విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న వీరిద్దరు కూడా నెక్స్ట్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వీరిద్దరి అభిమానులు కూడా కాసింత నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.