శంబాల బ్రేక్ ఈవెన్ కంప్లీట్.. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటనలో ఒకరు అయినటువంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించాడు. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన లవ్ లీ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక వరుసగా ఈయన నటించిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగులో భారీ గా పెరిగింది. అలాంటి సమయం లో ఈయన సుకుమారుడు అనే సినిమాలో హీరో గా నటించాడు.


భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా దగ్గర నుండి మొదలు పెడితే ఈయన అనేక సంవత్సరాలు భారీ అపజయాలను అందుకుంటూ కెరియర్ను ముందుకు సాగించాడు. తాజాగా ఈయన నటించిన శంబాల సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసులు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్టు స్టేటస్ ను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఏడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు దక్కగా ... 11.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు ఒక కోటి వరకు లాభాన్ని అందుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ భారీ లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకునే పరిస్థితిలు చాలా వరకు కనపడుతున్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: