ప్రభాస్ హీరోయిన్ తో ప్రేమలో తమన్.. ఏదో తేడా కొడుతుందిగా.?

Pandrala Sravanthi
ఏంటి తమన్ ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా..ఇది నిజమేనా.. ఇద్దరి మధ్య ఏదో సంబంధం లేకపోతే మరీ అంత సన్నిహితంగా కూర్చొని లవ్ సింబల్ షేర్ చేయడం ఏంటి అని ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఆలోచనలో పడిపోతారు. మరి ఇంతకీ తమన్ చేసిన పని ఏంటి.. ఆయన ఏ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు.. సోషల్ మీడియాలో వచ్చే ఈ వైరల్ వార్తల సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్లలో ఈయన పేరు ఉంటుంది. ఆయనే ఎస్.ఎస్. తమన్.. మెగా, నందమూరి,ఘట్టమనేని, దగ్గుబాటి, అల్లు, అక్కినేని ఇలా ఏ ఫ్యామిలీ హీరోల సినిమాలైనా సరే ఈయన మ్యూజిక్ అందించాల్సిందే. అలా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్. తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే.


2025లో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి తన హవా కొనసాగించిన ఈయన 2026 లో కూడా చాలా బిజీగా ఉన్నారు.అయితే ఈయన మ్యూజిక్ అందించిన ది రాజా సాబ్ మూవీ జనవరి 9న విడుదల కాబోతోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ది రాజా సాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ తో తమన్ దిగిన ఒక ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అంతేకాదు ఆ ఫోటోతో పాటు ఆయన పెట్టిన క్యాప్షన్ కూడా సోషల్ మీడియాలో పలు రూమర్లకు దారితీసింది.మరి ఇంతకీ తమన్ పెట్టిన ఆ క్యాప్షన్ ఏంటయ్యా అంటే నిధి అగర్వాల్ తో తమన్ క్లోజ్ గా కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో పాటు "హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అజ్" క్యాప్షన్ పెట్టి దాని పక్కనే లవ్ సింబల్ కూడా జోడించడంతో ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది. అంతేకాదు వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది కాబట్టే అంత సన్నిహితంగా కూర్చున్నారు. 


లేకపోతే మరీ అంత క్లోజ్ గా కూర్చొని లవ్ సింబల్ ని పోస్టులో పెట్టాల్సిన అవసరం ఏముంది..వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అయితే తమన్ పెట్టిన పోస్ట్ కి నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చుకున్నప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటో వైరల్ గా మారడంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. మరి నిజంగానే నిధి అగర్వాల్ తో తమన్ ప్రేమలో పడ్డారా? పెళ్లయ్యాక ఇదేం పని.. దీనిపై తమన్, నిధి అగర్వాల్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: