అఖండ 2 : 20 రోజులు బాక్సాఫీస్ రిపోర్ట్.. ఆ విషయంలో భారీ ఎదురుదెబ్బ తగలనుంది..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన అఖండ 2 మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల్లో ఈ సినిమాకు పర్లేదు అనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మరి 20 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 19.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 12.10 కోట్లు , ఉత్తరాంధ్ర లో 5.70 కోట్లు , ఈస్ట్ లో 4.37 కోట్లు , వెస్ట్ లో 3.40 కోట్లు , గుంటూరు లో 5.54 కోట్లు , కృష్ణ లో 3.47 కోట్లు , నెల్లూరు లో 2.77 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 రోజుల్లో ఈ సినిమాకు 56.97 కోట్ల షేర్ ... 94.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 20 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 7.10 కోట్లు , ఓవర్ సిస్ లో 4.97 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 69.04 కోట్ల షేర్ ... 119.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపుగా 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 35 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: