చంద్ర బాబు: రామోజీరావు పై ప్రేమతో సంచలన నిర్ణయం..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు, ప్రముఖ నిర్మాత వార్తాపార్థిక అధినేత రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావుకు, చంద్రబాబుకు  మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో ఏళ్లుగా టిడిపి పార్టీకి సపోర్టివ్ గా చంద్రబాబుకి సపోర్టివ్ గానే వ్యవహరిస్తున్నారు.అయితే ఇటీవలే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆయన మరణించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబుకు ఒక కుడి భుజం లాంటి వ్యక్తి వెళ్లిపోయారని చెప్పవచ్చు. రామోజీరావు మధ్య ఉండే స్నేహబంధం మీద చంద్రబాబు నాయుడు సంతాప సభను కూడా ప్రకటించడం జరిగింది.

తాజాగా విశాఖపట్నం కి సినీ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తామని ఏపీ చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఏర్పాటు చేసే ఫిలిం సిటీకి దివంగత రామోజీరావు పేరును కూడా పెట్టబోతున్నట్లు ఆయన తెలియజేశారు. విజయవాడ ప్రాంతంలో ఉండే కానూరులో రామోజీరావు సంస్కరణ సభను సైతం ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు నేలపై అక్షర జ్యోతులు వెలిగించిన రామోజీరావు కీర్తి ఎంతో గొప్పది పత్రికా రంగం నుంచి సినీ రంగం వరకు ఎన్నో రంగాలలో ఆయన ఎనలేని కృషి చేశారు అంటూ తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టాలని రామోజీరావు తనకు సూచించారంటూ సీఎం వెల్లడించారు. సినీ మీడియా రంగంలో అన్నిటికీ పెద్దపీట వేశారని అనేక సంస్థలను కూడా స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు అంటూ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల రూపాయలకు పైగా  కరోనా  సమయంలో సహాయం చేశారంటూ తెలిపారు. నిజాయితీ విలువలతో కూడిన పాత్రికేయుడుగా మీడిగా రంగంలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అంటూ తెలిపారు చంద్రబాబు. రామోజీరావుకు భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అంటూ తెలిపారు. అలాగే త్వరలోనే రామోజీ విజ్ఞాన కేంద్రాన్ని కూడా అమరావతిలో స్థాపిస్తామంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: