సీమ ఎమ్మెల్యే గారి తాలూకా : పెద్దిరెడ్డా మజాకా...కూటమిని ఉతికారేసిన సీమ బిడ్డ?

Veldandi Saikiran
* రాయలసీమ ముద్దుబిడ్డ
* పెద్దిరెడ్డి అడ్డా పుంగనూర్‌
* జగన్‌ కు అత్యంత సన్నిహితుడు
*  ఓటమి తెలియని రాజకీయ నాయకులు
* కూటమి ఊపును కుదిపేసిన టైగర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే... వరుసగా గెలుస్తూనే ఉంటారు. తమ నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. అలా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో...  మాజీ మంత్రి వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. వైసిపి పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.... ఇప్పటివరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్ పార్టీలో తన... రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.... వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి వెంట ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ తర్వాత వైసిపి పార్టీలో చేరిపోయారు. పుంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఏ పార్టీలో ఉన్నా సరే... ఓటమి ఎరగని నాయకుడిగా ఎదిగారు.

తాను గెలవడమే కాకుండా... తన తనయుడు మిథున్ రెడ్డి విజయానికి కూడా... మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2024 ఎన్నికల్లో వైసిపికి ఎంత ఎదురుగాలి వచ్చినా కూడా... తట్టుకొని నిలిచారు. అటు ఎంపీగా తన కొడుకును గెలిపించుకున్నారు. వైసీపీ పాలనలో మంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు. ఒక తండ్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా.... అన్ని రంగాల్లో సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు పెద్దిరెడ్డి.

తన నియోజకవర్గాన్ని... గత 25 సంవత్సరాలుగా... తన చేతిలో పెట్టుకొని రాయలసీమ ముద్దుబిడ్డగా... ఎదిగారు పెద్దిరెడ్డి. ఇక ఇప్పుడు.... కష్టకాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా  పెద్దిరెడ్డి ఉంటున్నారు. మళ్లీ వైసిపి అధికారంలోకి వచ్చే దిశగా... ఏం చేయాలో తన వంతు తాను చేస్తున్నారు. ఏజ్ పైబడినప్పటికీ కూడా.... ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అయితే... పుంగనూరులో...  పెద్దిరెడ్డి పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఆయన ఓడిపోయేంత మాత్రం లేదు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనను... మొన్న కూడా గెలిపించుకున్నారు పుంగనూరు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: