చంద్రబాబు కీలక నియామకాలు.. కీ పోస్టుల్లో ఆ ఇద్దరు?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలక పోస్టుల్లో ఇద్దరిని నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గానూ పీయూష్ కు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వరిస్తారు. ఇటీవలే కేంద్ర సర్వీసు నుంచి ఏపి కేడర్ లోకి చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కు  ఏపీ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయడంతో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక మరో కీలక పోస్టు విషయంలోనూ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ , ఎండీ గా విశ్రాంత ఐఎఎస్ లక్ష్మీ పార్ధసారధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడీసీ సీఎండీగా ఆమెను నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య కాలంలో ఏడీసీ సీఎండీగా వ్యవహరించిన లక్ష్మీ పార్ధసారధికి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై అవగాహన ఉంది. అందుకే ఆమెను నియమిస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: