రేవంత్ రెడ్డిపై.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు..? ఇంత దారుణమా?

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ చరిత్రలోనే లేని విధంగా లోక్‌సభ ఎన్నికల్లో డక్‌ అవుట్‌ అయ్యింది. అయితే.. ఇది బీఆర్‌ఎస్‌ కావాలనే చేసిందని.. తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేసి కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్ర పన్నిందని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

మెదక్ లో భాజపాను భారాస గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరి కాదు అన్న మాజీ మంత్రి హరీష్ రావు.. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల భారాస మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా భారాసకు మెజారిటీ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో భాజపాకు మెజారిటీ వచ్చింది... రేవంత్ రెడ్డి అక్కడ భాజపాకు కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా అని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు.

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో భాజపా ఎలా గెలిచింది... అక్కడి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాను గెలిపించారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డికి వచ్చిన 32 వేల మెజారిటీ... పార్లమెంటు ఎన్నికల్లో 21 వేలకు తగ్గింది, మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి భాజపాకు వేయించారా అని మాజీ మంత్రి హరీష్ రావు లాజిక్‌తో కొట్టారు. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో భాజపా భారీ మెజారిటీతో ఎలా గెలిచింది... ఈ రెండు చోట్ల భాజపాను కాంగ్రెస్ గెలిపించిందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
భాజపా పంచన చేరింది, మోదీ శరణు చొచ్చింది... రేవంత్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ లో ఉండి భాజపా ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అన్న మాజీ మంత్రి హరీష్ రావు.. నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మోదీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నారని.. విభజన హామీలపై మోదీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: