వైసీపీ : మాది ఊర మాస్‌ పార్టీ..మేము తిరగబడితే ఎవడు మిగలరు ?

Veldandi Saikiran
మాది ఊర మాస్‌ పార్టీ..మేము తిరగబడితే ఎవడు మిగలరు అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఉదయభాను మీడియాతో వైసీపీ ఓటమిపై మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామని....జగ్గయ్యపేటలో గెలిచిన శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ కు అభినందనలు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని తెలిపారు. పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటు న్నారని ఫైర్‌ అయ్యారు. దాడులు ఆపకపోతే ప్రతీకార చర్యలకు దిగుతామని వార్నింగ్‌ ఇచ్చారు. మాది మాస్ పార్టీ, మేము తిరగబడితే ఎవరు మిగలరు గుర్తుంచుకోండని హెచ్చరించారు. ప్రజలు తీర్పునిచ్చారు, వారికి మంచి పరిపాలన అందించండని కోరారు మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఉదయభాను.  
మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి విర్రవీగుతున్నారని మండిపడ్డారు. మీరు చేసే దాడులను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల గమనిస్తున్నారన్నారు. వికృత చేష్టలు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జిల్లాలో కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని మండి పడ్డారు. గ్రామ సచివాలయాలపై తెలుగుదేశం జెండాలు ఎగరవేయటం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఉదయభాను.

 
ఎప్పటికీ మీదే అధికారం ఉండబోదని... మళ్లీ మేం కూడా అధికారంలోకి వస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే జగ్గయ్య పేట ఉదయభాను. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మెదలాలని హెచ్చరించారు. ఇక నైనా తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బుద్ది తెచ్చుకోవాలని...ఏపీ అభివృద్దిపై శ్ర ద్ద పెట్టాలని కోరారు. కాగా... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఉదయభాను...తెలుగు దేశం పార్టీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య చేతిలో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: