ప్లీజ్.. అటువంటి పనులు చేయవద్దు.. మృణాల్ ఠాకూర్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు..!

lakhmi saranya
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్స్ గా అడుగుపెడుతూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకోగలరు. అలా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. టాలీవుడ్ సీతామహాలక్ష్మి గా గుర్తింపును పొందిన ప్రస్తుతం యూత్ కలల రాణిగా మారిపోయింది. సీతారామం చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ని అందుకుంది.
ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో అనంతరం హాయ్ నాన్న మూవీలో నటించిన మృణాల్. ఇక ఇది కూడా సూపర్ హిట్ అవడంతో ఈమెకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటుంది. దీంతో పాటు ఒక్కొక్కసారి బోల్డ్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టీంట హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటోస్ ను చూసిన పలువురు.." ప్లీజ్.. మృణాల్ నిన్ను ఇలా చూడలేకపోతున్నాం. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో సీతామహాలక్ష్మి లాగానే ఉండు. ఇలా బోల్డ్ ఫోటోలు షేర్ చేయవద్దు. ఇది మా రిక్వెస్ట్ అనుకో. ఇటువంటివి షేర్ చేయడం ద్వారా నీకు ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. దయచేసి మా బాధ అర్థం చేసుకో. ఇప్పటివరకు ఎంతో పద్ధతిగా ఉన్న నువ్వు ఒక్కసారిగా ఈ విధంగా మారిపోయావేంటో మాకు అర్థం కావడం లేదు. కానీ నిన్ను ఇలా చూడలేకపోతున్నాం. నువ్వు ఎప్పటికీ సీతామహాలక్ష్మి వే. నువ్వు ఈ విధంగా బోల్డ్ షో చేసినంత మాత్రాన నీకు అవకాశాలు రావు. నువ్వు పద్ధతిగా ఉంటేనే నీకు వచ్చే అవకాశాలు వస్తాయి " అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: