టీమిండియా యంగ్ స్టార్ ముషీర్ ఖాన్... కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెరీర్ దూసుకు వెళ్తున్న నేపథ్యంలో అతనికి యాక్సిడెంట్ కావడం జరిగింది. ముషీర్ ఖాన్ ఎవరో కాదు.. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. సర్ఫరాజ్ కుటుంబంలో అందరూ క్రికెటర్లే. సర్పరాజు తండ్రి నౌషద్ ఖాన్.. మంచి కోచ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో... ముషీర్ ఖాన్ అలాగే సర్పరాజ్ చాలా ఎత్తుకు ఎదిగారు.
అయితే టీమ్ ఇండియాకు.. దగ్గరవుతున్న ముషీర్ ఖాన్ కు ఈ నేపథ్యంలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతంలో... ముషీద్ ఖాన్ కు రోడ్డు జరిగిందని సమాచారం. తన తండ్రి నౌషద్ ఖాన్ తో కలిసి లక్నో కి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కొంతమంది చెబుతున్నారు. వాస్తవంగా ఇరానీ ట్రోఫీ కోసం... ముంబై నుంచి లక్నోకు వెళ్లాడట ముషీర్ ఖాన్.
అయితే లక్నో... సమీపంలో.. తన తండ్రి నౌషద్ ఖాన్ తో కారులో ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు కారులో ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ... తన తండ్రి మాత్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే అతివేగం కారణంగా.... ముసిర్ ఖాన్ కారుకు ప్రమాదం జరిగిందట. అయితే ఈ కారు ప్రమాదంలో ముషీర్ ఖాన్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. చేతులకు కూడా అభిపరితంగా గాయాలు అయ్యాయట.
దాదాపు మూడు నెలల పాటు ముషీర్ ఖాన్ రెస్ట్ తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు వైద్యులు. దీంతో ఇరానీ ట్రోఫీకి... ముషీర్ ఖాన్ దూరం కాబోతున్నాడట. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇరానీ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ టోర్నీకి సెలెక్ట్ అయిన ముషీర్ ఖాన్... యాక్సిడెంట్ కారణంగా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఈ ఇరానీ ట్రోఫీలో బాగా ఆడి టీమిండియాలోకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మిస్డ్కాన్. కానీ అతని ఆశలు అడియాశలు అయిపోయాయి.