క్యాస్ట్ వల్లే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ని టాలీవుడ్ లో తొక్కేస్తున్నారా.?

Pandrala Sravanthi
భీమ్స్ సిసిరోలియో..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది.గోదారి గట్టు మీద రామచిలకవే అనే పాటకు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ధమాకా సినిమాతో భీమ్స్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.బలగం సినిమాకి కూడా భీమ్స్ సంగీతం అందించాడు.అయితే ఈయన ఖాతాలో మంచి హిట్ పాటలు ఉన్నప్పటికీ స్టార్ హీరో నుండి ఈయనకు పిలుపు రావడం లేదు. దాంతో క్యాస్ట్ వల్లే ఆయన్ని ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్ తో పాటు కాస్త సహాయ సహకారాలు కూడా ఉండాలి. చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇండస్ట్రీలో ఎదనివ్వరని రెడ్డి, కమ్మ లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మాట్లాడుకుంటారు. అలాగే తక్కువ జాతి నుండి ఇండస్ట్రీకి వచ్చేవారిని పట్టించుకోరు అనే టాక్ ఉంది. 

ఒకవేళ వాళ్ళు ఎదిగితే మాత్రం వాళ్ళని తొక్కేయాలని చూస్తారట. అయితే ప్రస్తుతం భీమ్స్ సిసిరోలియో పరిస్థితి కూడా అదేనని,గిరిజన బిడ్డ ఎదగడం ఏంటి అని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తొక్కేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వాళ్లు మాట్లాడుకుంటున్నారు.. ఇక విషయంలోకి వెళ్తే..ధమాకా సినిమాతో  భీమ్స్ సిసిరోలియో తన సత్తా ఏంటో తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించాడు. అలాగే బలగం, మ్యాడ్ వంటి సినిమాలకు కూడా భీమ్స్ మ్యూజిక్ అందించాడు.ఇక ఈయన మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ఇక తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా భీమ్స్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలోని రమణ గోగుల పాడిన గోదారి గట్టుమీద పాటకి భీమ్స్ సంగీతం ఎంత అద్భుతంగా ఇచ్చాడో చెప్పనక్కర్లేదు. ఈ పాటతో భీమ్స్ సిసిరోలియో పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.

 ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయితే మూడు పాటలు కూడా మ్యూజిక్ పరంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా హిట్ అయితే గనుక భీమ్స్ సిసిరోలియో చేతిలో స్టార్ హీరోల సినిమాలు ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అందరికీ తెలియని మరొక సంచలన విషయం ఏంటయ్యా అంటే.. రాజశేఖర్ హీరోగా చేసిన ఆయుధం సినిమా ఇప్పటి జనరేషన్ వాళ్ళు చూడకపోయినా ఆ సినిమాలోని ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనే పాట అందరూ వినే ఉంటారు.ఇక ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని రాసింది ఎవరో కాదు భీమ్స్ సిసిరోలియోనే.. అలా దాదాపు 20 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ ఆయనకు సక్సెస్ అందడం లేదు. క్యాస్ట్ పరంగానే ఆయన్ని తొక్కేస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. మరి చూడాలి ఫ్యూచర్లో అయినా ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గౌరవం దక్కుతుందో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: