గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న థియేటర్లలోకి రాబోతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేల రోజుకో అప్డేట్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఇక నేడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో అట్టహాసంగా జరగబోతున్న సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ తో పాటుగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆయన స్పీచ్ మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ అభిమానులను, జనసైనికులను ఆకట్టుకుంటుంది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇదిలావుండగా ఇక ఈ ఈవెంట్లో సినిమా దర్శకుడు అయిన శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పారు. అలాగే ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక కలెక్టర్ కి ఒక మినిస్టర్ కి మధ్య జరిగే వార్ లా నడుస్తుందంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరి మొత్తానికైతే శంకర్ గేమ్ చేంజర్ స్టోరీ చెప్పడం వెనక కారణం ఏంటి? ఎందుకు చెప్పేసాడు అంటూ కొంతమంది మెగా అభిమానులు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్టోరీ రివిల్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈవెంట్ కి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ తన అన్న కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారని చాలా మంది అనుకుంటారు.ఒక విధంగా ఆయన రామ్ చరణ్ కోసం వచ్చినప్పటికి సినిమా కథలో హీరో నిజాయితీగా పోరాటం చేసే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో జనానికి ఏం కావాలి అనేది తెలుసుకుంటాడు. తద్వారా హీరో నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని ప్రమోట్ చేసిన తప్పు లేదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి అయితే వచ్చాడు.ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య, అంజలి, నవీన్ చంద్ర, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైప్ తెచ్చుకుంది.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.