ఇలాంటి కోడిగుడ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?
కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం విరిగిన గుడ్లలో సాల్మోనెల్లా అనే ఒక భయంకరమైన బాక్టీరియా ఉంటుందట. ఈ బాక్టీరియా దాని షేల్ ద్వారా గుడ్డు లోనికి ప్రవేశించి తిన్న వ్యక్తికి సైతం సోకేలా చేస్తుందట. సాల్మోనెల్లా అనేది కూడా ఒక పాయిజన్ వంటిదట. ఇది తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు తిమ్మిరిగా అనిపించడం వంటివి జరుగుతాయట. ఎవరైనా బలహీనంగా ఉండేవారు రోగనిరోధక శక్తి పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఎక్కువగా చిన్న పిల్లలకు ,వృద్దులకు ఇది ప్రాణాంతకరంగా కూడా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
గుడ్డు పగిలిందా లేదా అనే విషయం పై చెక్ చేసిన తర్వాత ఉడక పెట్టుకోవడం మంచిది. గుడ్డు పగిలిన తర్వాత దాని ఉపరితలం పైన మొత్తం బ్యాక్టీరియా పేరుకు పోతుందట.. ఒకవేళ మీరు ఉడకపెట్టిన వాటిలో గుడ్డు పగిలినట్టుగా అనిపిస్తే వాటిని బయటికి పారి వేయడం మంచిది. అలాంటి గుడ్డును తినకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఒకవేళ గుడ్డు నుంచి కూడా దుర్వాసన వస్తూ ఉంటే అది చెడిపోయినట్టుగా గుర్తించాలి. ఒకవేళ గుడ్డు పగిలిందా లేదా అని తెలుసుకోవాలి అంటే నీటిలో వేయడం వల్ల నురుగు కనిపిస్తే అది తినడానికి కూడా ఉపయోగపడదని అర్థం. గుడ్లను తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉంచకుండా చూసుకోవాలి.