
త్రివిక్రమ్ బిగ్గెస్ట్ ప్లాన్ .. ఐకాన్ స్టార్ తో ఊహించని ప్రయోగం..?
అయితే నిజానికి పుష్ప2 తర్వాత ఈ సినిమానే మొదలు పెట్టాల్సి ఉంది .. కానీ ఇప్పుడు దీనిని అట్లీ ప్రాజెక్ట్ తర్వాత చేస్తున్నట్టు తెలుస్తుంది . అయితే ఇప్పుడు తాజా గా త్రివిక్రమ్ తో చేసే సినిమా విషయం లో నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి .. అల్లు అర్జున్ తో తాము భారతీయ సినిమా దగ్గర ఎవరు ఊహించని టచ్ చెయ్యని మైథాలజీ సబ్జెక్టు తో సినిమా చేసి ఎంతో గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నట్లు గా అయిన ఓ పాయింట్ ను రివీల్ చేశారు .
ఒక్కసారి ఈ సినిమా వచ్చాక భారతదేశం మొత్తం ఈ సినిమా వైపు చూస్తుందని నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు .. అలాగే ఇది మహాభారతం లేదా రామాయణం కి సంబందించిన కథ కాదు అని మన పురాణ ఇతిహాసాల్లోనే ఎవరికి తెలియని ఓ సరికొత్త పాత్ర తో తాము ఈ సినిమా చేస్తున్నట్టు గా చెప్పుకొచ్చాడు .. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ బన్ని అభిమానుల్లో మరింత ఆస్తిని పెంచేస్తున్నాయి .. ఇక మరి త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కు ఎలాంటి స్టోరీ రాస్తున్నాడు .. అసలు ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు అనే దాని పై కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .