రిపోర్టర్ని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్.. కారణం ఇదే...!?

Amruth kumar
ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా కాలంలో మీడియా రిపోర్టర్లు హీరో హీరోయిన్లను పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు కానీ అప్పట్లో హీరో హీరోయిన్లు అంటే ఓ గౌరవం ఉండేది. ఇలాగే ఓ స్టార్ హీరోయిన్ రిపోర్టర్ పిచ్చి ప్రశ్న అడగడంతో ఆమె ఏకంగా అతని చెప్పుతో కొట్టిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పిచ్చి ప్రశ్న అడగడంతో తిక్క లేసిన స్టార్ హీరోయిన్ సదరు రిపోర్టర్ ని చెప్పుతో కొట్టి తన కోపాన్ని తెచ్చుకుంది. అలా రిపోర్టర్ ని కొట్టిన స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అలనాటి అందాల నటి వాణిశ్రీ. ఇప్పుడైతే రోజుకొక హీరోయిన్లు వస్తున్నారు కానీ గతంలో హీరోయిన్లు ఎంతో పరిమిత సంఖ్యలో ఉండేవారు. ప్రధానంగా పాతకాలం హీరోయిన్లు అంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు సావిత్రి ఆ తర్వాత ప్రధానంగా వినిపించే పేరులో వాణిశ్రీ కూడా ఒకరు.
కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటించిన వాణిశ్రీ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా అక్కినేని- వాణిశ్రీ కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్. అయితే ఇప్పటి వారికి వాణిశ్రీ నటన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఆమె నటనకు వీర అభిమానులు ఉండేవారు. అయితే వాణిశ్రీ ఎక్కువగా పొగరుబోతు క్యారెక్టర్ లోనే నటించింది.
ఎప్పుడు ఎంతో కూల్ గా ఉండే వాణిశ్రీ ఒకసారి ఏకంగా రిపోర్టర్ ని చెప్పుతో కొట్టి ఎంతో సంచలనంగా మారింది. ఓ సినిమా ఫంక్షన్లో సదురు సీనియర్ రిపోర్టర్ అడిగిన తిక్క ప్రశ్నకు వాణిశ్రీ కి పిచ్చ కోపం వచ్చిందట తన కోపాన్ని తట్టుకోలేక చెప్పు తీసి రిపోర్టర్ చంప పగలగొట్టింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో కొన్ని పత్రికలు వాణిశ్రీ కి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసే వారట అందులో ఒక పత్రిక పేరు భోగిశ్రీ కేవలం వాణిశ్రీని ఏడిపించడం కోసమే ఈ పత్రికను నడిపే వారట.
ణాణి శ్రీ నల్లగా ఉండటంతోనే బొక్కి శ్రీ అనే పేరుతో ఆ పత్రిక నడిపే వారట.. అందులో వాణిశ్రీ గురించి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసే వారట. అప్పటికే తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉన్న వాణిశ్రీ కి ఈ విషయం తెలియదట. కానీ ఒక్కగానొక్క క్షణంలో ఆమెకి ఆ విషయం తెలిసి మండిపడ్డారట! ఇక ఆరోజు రానే వచ్చింది! సదరు పత్రిక విలేకరు ఒకరు వాణిశ్రీ కి ఎదురుపడి, కోరి గెలుక్కున్నాడట.దాంతో తిక్క రేగిన వాణిశ్రీ కోపం కట్టలు తెంచుకొని, వాడిని చడా మడా తిట్టేసి, తన కాలికొన్న చెప్పును తీసి ఎడా పెడ వాయించేసారట! ఇంకా తరువాత కాలంలో ఆ పత్రిక కనుమరుగయ్యిందని సమాచారం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: