బుల్లితెర పైకి రంగమ్మత్త రీ ఎంట్రీ.. బిగ్ బాస్ అమర్ తో టీవీ షో..!

lakhmi saranya
బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరైన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోకు దాదాపు 9 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ తో పాటు టీవీ షోస్ తో బుల్లితెర స్టార్ గా మారి మంచి ఇమేజ్ను సంపాదించుకుంది అనసూయ. ఇక ప్రస్తుతం రెండేళ్లగా ఈమె టీవీ షోస్ కి దూరంగా ఉంటుంది.
2022లో జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పి ఫ్రాన్స్ కి షాక్ ఇచ్చింది. అనసూయ స్థానంలో సిరి జబర్దస్త్ కు యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇక రంగస్థలం, పుష్ప తరువాత సినిమాలతో బిజీ కావడంతో అనసూయ టీవీ షోస్ ని పూర్తిగా మర్చిపోయింది. ఇక తాజాగా రెండేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరకి అనసూయ ఎంట్రీ ఇస్తుంది. ఓ రియాలిటీ గేమ్ షోకు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పేరుతో స్టార్ మా చానల్లో రియాలిటీ షో టెలికాస్ట్ కాబోతుంది. ఈ షో అనౌన్స్మెంట్ వీడియోను స్టార్ మా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక ఈ వీడియోలో బిగ్ బాస్ రన్నర్ అప్ అమర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అమర్ తో పాటు విష్ణుప్రియ మరియు శోభా శెట్టి, దీపికా , రీతు తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఈ వీడియో చివరలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ ఎంట్రీ ఇచ్చారు. అమర్ అండ్ గ్యాంగ్ తో కలిసి వీరిద్దరూ కాసేపు డాన్స్ చేశారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో లో టీవీ సెలబ్రిటీలు అమ్మాయిలుగా అబ్బాయిలుగా రెండు టీములుగా విడిపోయి ఫన్నీ గేమ్స్ అండ్ డాన్స్ లతో ప్రేక్షకులను ఆలపిస్తున్నారు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: