ఏపీ: ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు మౌనం ఎందుకు పాటిస్తున్నాయి.. భయపడుతున్నాయా?

Suma Kallamadi
సాధారణంగా చంద్రబాబు ఏదైనా పని చేస్తున్నా, లేకపోతే ఆయన ఏదైనా సాధించబోతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తాయి. వీటి హడావుడి ఎప్పుడు 4 అడుగుల ముందుగానే ప్రారంభమవుతుంది. ఆ కోణంలో చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో చంద్రబాబు గెలిచేసారని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలుపెట్టి ఉండాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు ఈ రెండు మీడియా సంస్థలు సైలెంట్ అయిపోయాయి. ఈ వ్యూహాత్మక మౌనం వెనుక కారణమేంటి? సందేహమా లేదంటే భయమా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
వైసీపీ అనుకూల మీడియా సాక్షి జగన్ గెలుస్తున్నారని, ఆయన గెలవడానికి కారణాలు ఇవే అంటూ ఒక పెద్ద ఆర్టికల్ ప్రచురించింది కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం అలాంటి ఒక కథనం కూడా ప్రచురించలేకపోయాయి. ఎన్నికలకు ముందు జగన్ ను దించేయండి అని ధైర్యంగా దిగజారి మరీ ఇదే పత్రికలు కథనాలను రాశాయి. జగన్ను గద్దె దించాలంటూ ఒకరకంగా ఇవి ప్రజలకు నిర్భయంగా పిలుపు కూడా ఇచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా చంద్రబాబు గెలుస్తాడని చెప్పలేకపోతున్నాయి. టీడీపీ నేతల్లో విశ్వాసం పెరిగింది అంటూ ఆర్టికల్స్ వస్తున్నాయే తప్ప 150 సీట్లు చంద్రబాబు గెలుస్తారు అని మాత్రం రాయడం లేదు.
తమ వ్యూహాలు ఫలించాలని ప్రజలు తమ వైపే ఉన్నారని 150-160 సీట్లు చంద్రబాబుకు వస్తాయని ఈ రెండు పత్రికలు రాయగలవు కానీ సందేహమో లేదంటే భయమో వీరిని వెనక్కి లాగేస్తోంది. ఎన్నికల రిజల్ట్స్ వచ్చేదాకా ఆగుదాం అనే నైతిక విలువలు ఈ రెండు పత్రికలకు లేవు. ఆ విషయం ఎన్నికలకు ముందు నిరూపితమయింది. బహుశా ఈ రెండు మీడియా సంస్థలకు చంద్రబాబు ఓటమి ఖాయం అని తెలిసి ఉంటుంది. ఆ విషయం తెలిసి ఏం గెలుస్తున్నారు అని రాయటం వల్ల ప్రజల్లో నవ్వులు పాలు కావడం తప్ప వచ్చే లాభం ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వెల్లడించడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో జగన్ హాయిగా లండన్ టూర్ ఎంజాయ్ చేయనున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలోనే ఉండే అవకాశం ఉంది. ఓడిపోతే వీరి పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: