జగన్: తిరుగులేని అస్త్రం ఆ సైన్యమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో కీలకంగా మారనున్నాయి. అటు అధికార పార్టీ వైసిపి.. ప్రతిపక్ష పార్టీ టిడిపి తమతమ ప్రణాళికలతో ప్రజలలోకి వెళ్తూ ఉన్నారు. అయితే అధికార పార్టీ వైసీపీకి తిరుగులేని శక్తిగా ఉన్నది సోషల్ మీడియా సైన్యం అని కూడా చెప్పవచ్చు. జగన్ పైన ఎవరు విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలను సైతం తిప్పి కొట్టడంలో చాలా దీటు అని ఎన్నోసార్లు నిరూపించారు. ఈ విషయంలో మాత్రం వైసిపి సోషల్ మీడియా చాలా కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది.. 2019 ఎన్నికలలో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధించడానికి ముఖ్య కారణం సోషల్ మీడియాని అని కూడా చెప్పవచ్చు.

వైసీపీ ఏర్పడిన తర్వాత నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఆ పార్టీకి బ్యాక్ బోన్ గా సోషల్ మీడియా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇందులో 4500 మంది సోషల్ మీడియా వారియర్లుగా పనిచేస్తున్నారని ఇది ఒక తిరుగులేని శక్తిగా ఉందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఇతరత్రా వాటికి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యేలా  చేస్తూ ఉంటారు. వైసీపీ పాలనకు బీజం వేస్తూ జనాలలో మరింత క్రేజీ పెంచేలా సోషల్ మీడియా సమర్థవంతంగా పనిచేస్తోంది.

ముఖ్యంగా టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా, పత్రికలను సైతం విమర్శించి తిప్పి కొట్టడంలో వైసిపి సోషల్ మీడియా ముందు వరుసలో ఉంటుంది.. అంతేకాకుండా వైసిపి సోషల్ మీడియాలో దాదాపుగా మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.. ఎప్పటికప్పుడు జనాలకు పార్టీలకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా సరే సోషల్ మీడియాలో కీలకంగా పోషిస్తూ ఉంటుంది వైసీపీ.. ఈ సోషల్ మీడియాని ఇన్చార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవి మెయింటైన్ చేస్తున్నారు. కేవలం పార్టీ కోసమే స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తులని కూడా ఆయన తెలియజేశారు. మండల స్థాయి నుంచి, గ్రామస్థాయి, నియోజకవర్గాలలో కూడా సోషల్ మీడియా కమిటీలు ఉన్నాయని వైసీపీకి ఇదే తిరుగులేని ఒక సైన్యం అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: