వైసీపీ విక్టరీ: మహిళల బారులు.. మొత్తం ఫ్యాన్‌కే గుద్దేశారా?

Chakravarthi Kalyan
ఏపీలో ఓటు చైతన్యం పెరిగింది. ఓటు వేసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమాయానికే జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడం ఈ సారి ఎన్నికల్లో కనిపించింది. అయితే పోలింగ్ పెరిగిన క్రమంలో ఎవరికీ కలిసి వస్తుందనే ఉత్కంఠ అన్ని పార్టీల్లో నెలకొంది.

2019 ఎన్నికల్లో దాదాపు 80 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది. ఈ సారి అంతకు మించే పోలింగ్ నమోదు అవుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటర్లుగా నమోదు అయిన 10 లక్షల యువత తొలిసారి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. ఇది ఎవరికీ నష్టం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

అయితే ఈ సారి ఏపీలో వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు పోలింగ్ లో భాగస్వాములయ్యారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే హర్షించదగిన విషయమే.   ఈ పోలింగ్ సరళి రాజకీయ నేతలకు ఓ వైపు భయం.. మరోవైపు ఆందోళన కలిగించాయి.  ఎందుకంటే వచ్చిన వారంతా తమకే ఓటు వేశారా అనే అనుమానం మరో వైపు. అయితే ఈ సారి ఎప్పటి లాగే మహిళా ఓటర్లు బారులు తీరారు.

సాధారణంగా పది గంటల తర్వాత ఇంటి పని మొత్తం ముగించుకొని నారీ మణులు పోలింగ్ బూత్ లకు రావడం మనం గమనిస్తుంటాం. దీనికి భిన్నంగా ఈ సారి ఉదయం నుంచే వారంతా బారులు తీరారు. వీరు తమకే ఓటు వేశారు అని ఏ పార్టీ కూడా బలంగా నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మొగ్గు చూపారా.. లేక ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పిన చంద్రబాబుని నమ్మారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. గత ఎన్నికల్లో మహిళలు బారులు తీరి ఓటు వేస్తే పసుపు కుంకం పథకం పనిచేసిందని టీడీపీ నేతలు భావించారు. తీరా ఫలితాలు చూస్తే సీన్ రివర్స్ అయింది. మరి ఈ సారి మహిళలు చైఎత్తి దేనికి జై కొట్టారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: