లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. అయితే కాజల్ కి మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం చందమామ. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివ బాలాజీ హీరోలుగా చేసిన ఈ సినిమాలో కాజల్ నిజంగానే చందమామలా మెరిసి అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఆమె అభిమానులే కాదు..తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను చందమామ అని పిలవసాగారు.చందమామ సినిమా తరువాత కాజల్ కి తెలుగు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఎప్పుడు రాలేదు. ఆ తరువాత వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. అక్కడి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. ఇక కెరియర్ దూసుకుపోతున్న సందర్భంలోనే గౌతమ్ అనే బిజినెస్ వ్యక్తిని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది కాజల్. అంతేకాకుండా ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత కాజల్ సినిమాలను ఎంచుకునే తీరుమారింది. రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలను కాకుండా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు ఓకే చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ క్రమంలో కాజల్ సత్యభామ అంటూ పోలీస్ ఆఫీసర్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కాజల్ బాగానే టైం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా సుడిగాలి సుదీర్ యాంకర్ గా చేసే ఆహా షోకి కాజల్ అగర్వాల్.. గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో ఈ సినిమా హీరో నవీన్ చంద్ర సైతం పాల్గొన్నాడు.
ఈ షోలో కాజల్ ని ఎన్నో ప్రశ్నలు అడిగారు సుధీర్. అందులో భాగంగా ఇంట్లో మీరు సత్యభామనా చందమామనా? అని అడగ్గా... కొడుకు నీల్ విషయంలో తాను చందమామ అని ..భర్త గౌతమ్ విషయంలో మాత్రం తాను సత్యభామను అని.. కాజల్ సమాధానం చెప్పింది. ఇక షో చివర్లో మాత్రం కాజల్ సుధీర్ మీద ఫైర్ అయ్యింది.సుధీర్ కాజల్ కి డబ్బులు లెక్కించే టాస్క్ ఇవ్వగా... ఆ గేమ్ లో నిమగ్నమైన కాజల్ ని సుధీర్ తన మాటలతో డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావని కాజల్ కొంచెం సుదీర్ పైన ఫైర్ అయ్యింది. అయితే అది పెద్ద సీరియస్ గొడవ కాదులెండి. గేమ్ గెలవాలనే కసిలో సుధీర్ ని అలా చిన్న వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది.