ఏపీ : రాష్ట్రమంతా నరాలు తెగే ఉత్కంఠత..ప్రజలంతా ఆ పార్టీ వైపే..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తుఫాన్‌ తీరం దాటింది.ఎన్నికల యుద్ధం లో విద్వంసకర ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకున్నాయి.అయినా కూడా ఈ సారి భారీ గా పోలింగ్ నమోదైంది. అప్పుడే ఓటు వచ్చిన యువకుల నుండి పండు ముసలమ్మల వరకు అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు గెలుపోటముల గురించి రాజకీయ పార్టీలు బేరిజు వేసుకుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కూడా ఎన్నికల ఫలితాల గురించే గంటల తరబడి డిస్కషన్.. ఈ సారి వైసీపీ పవర్‌ నిలబెట్టుకుంటుందా.. లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా అని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఎవరు అధికారం చేపట్టినా కానీ వారి మార్జిన్‌ ఎంత వరకు ఉండవచ్చు అని తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల ఫలితాలు అధికార, విపక్ష పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వారి వారి నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి సమాచారం తెప్పించుకుంటూ  గెలుపోటములపై తీవ్రంగా విశ్లేషించుకుంటున్నారు. ఎవరికి వారు గెలుపుపై వారు ధీమాగా ఉన్నా కూడా లోపల మాత్రం భయపడుతున్నట్లు గా తెలుస్తుంది. అయితే నూటికి 90 శాతం మంది. ఈ సారి ఫ్యాన్ గాలి మరింత స్పీడ్ గా వీచినట్లు తెలుపుతున్నారు. రాష్ట్రం లో అధికార వైసీపీ బలం బడుగు బలహీన వర్గాల ప్రజలు వీరంతా జగన్ వైపే వున్నారు.. వీరంతా జగన్ ను భారీ స్థాయిలో గెలిపించేందుకు మండుటెండను సైతం లెక్కజేయకుండా క్యూ లైన్స్ లో నిలబడి ఓట్లు వేయడం జరిగింది. దీనితో జగన్ విజయం ఖాయంగా కనిపిస్తుంది.రాష్ట్ర మహిళలు అంతా కూడా జగన్ పాలన మరోసారి రావాలని భారీగా ఓట్లు వేయడం జరిగింది. ఈ సారి మహిళా ఓటు శాతం ఊహించని స్థాయికి పెరిగింది. ఎంతలా అంటే ఈసారీ గెలుపును డిసైడ్ చేసే అంతగా పెరిగింది. దీనితో వారి ఓట్లు ఎంతో కీలకంగా మారానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: