టీవీ: అనసూయ పెళ్లి.. సినిమా స్టోరీని మించి..?

Divya
తెలుగులో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.. నిరంతరం ఈమె వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తనని ఎవరైనా ట్రోల్ చేసినా కూడా వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది.. మొదట అనసూయ న్యూస్ రీడర్గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ క్రేజ్ రాకపోవడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అలా వచ్చిన ఫేమ్ తో అనసూయ క్షణం, కథనం ,రంగస్థలం, పుష్ప తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది.

రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ కి ఒక మైలురాయిగా నిలిచిపోయింది.. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలలో నటిస్తోంది అనసూయ. దీంతో బుల్లితెరకు ఒకసారిగా గుడ్ బై చెప్పేసి వెండితెర పైన ఒక వెలుగు వెలుగుతోంది. నిరంతరం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ యాంకర్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం అనసూయ వయసు 38 ఏళ్లు.. అయినప్పటికీ కూడా హీరోయిన్లకు దీటుగా తన ఫిజిక్క ను మెయింటైన్ చేయడంలో శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది అనసూయ.

అయితే అనసూయది ప్రేమ వివాహం అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అనసూయ సెకండ్ ఇయర్ చదివే సమయంలో NCC క్యాంపులో ఉండేదట. అయితే అక్కడే సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడడంతో ఇద్దరు కూడా కొన్నేళ్లపాటు ప్రేమించుకున్నారట. అయితే వీళ్ళ పెళ్లి విషయం ఇంట్లో చెప్పకుండా అనసూయ తండ్రికి ఈ  విషయం తెలియకపోవడంతో ఈమెకు ఒక పైలెట్ సంబంధాన్ని తీసుకోవచ్చారట.. సంబంధం ఓకే చెప్పే సమయంలో అనసూయ తన ప్రేమ విషయాన్ని తన తల్లి ద్వారా తెలియజేసిందట.

ఈ విషయం పైన అనసూయ తండ్రి ఆగ్రహం తో ఊగిపోయి అనసూయ సూట్ కేసును సైతం బయటికి విసిరేసి గెంటేసారట.. అలా కొన్నేళ్లపాటు అనసూయ తండ్రి మనసు మార్చుకోకపోవడంతో చివరికి అనసూయని తన ప్రేమించిన భరద్వాజ్ తో లేచిపోదామని ఆప్షన్ ని ముందర పెట్టినప్పటికీ అతను ఒప్పుకోలేదట. పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం మంచిది కాదని.. మరో కొన్ని నెలలు వేచి చూద్దామని నచ్చచెప్పి.. ఉండడంతో చివరికి ఎట్టకేలకు అనసూయ తన తండ్రి ఒప్పించి మరి వివాహం చేసుకున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: