నేను సీఎంగా ఉన్నప్పుడు, జయలలితపై ఇంట్రస్టింగ్ కామెంట్..!
ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకురాలుగా జయలలిత కొనియాడారు ప్రధాని. అలాంటి నాయకులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో ఉంటారన్నారు. అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలు అని, తమిళనాడు సిఎంగా నమ్మిన ప్రజల అభ్యన్నతికి జయలలిత ఎంతగానో కృషి చేసారాన్ని, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిది అన్నారు ప్రధాని. జయలలిత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఓ మైలురాయిగా కొనియాడారు.
జయలలిత పరిపాలనలో, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. జయలలిత జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని కొనియాడారు. ఇక తాము సిఎంగా ఉన్న రోజులను ప్రస్తావిస్తూ.. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయలలిత హాజరు అయ్యారని గుర్తు చేసుకున్నారు. జయలలిత తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం తాను ఎప్పటకీ మర్చిపోనని కూడా మోడీ నాటి స్మృతులు నెమరవేసుకున్నారు.
ఆ తర్వాతి నుంచి తమ స్నేహం కొనసాగిందని, ఓ సారి పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి కూడా ఆహ్వానించారన్నారు మోడీ. ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేననని గుర్తు చేసుకున్నారు. సిఎంలుగా.. సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమన్నారు మోడీ.