Viral: బాటిళ్లతో నార్త్ కొరియన్స్ ఆకలి తీరుస్తున్న వ్యక్తి?

Purushottham Vinay
నార్త్  కొరియాలో ఏర్పడిన కరువు పరిస్థితుల కారణంగా ఓ వ్యక్తి ఆదుకోవాలని చూశాడు. దీంతో సౌత్ కొరియా నుంచి వాటర్ బాటిళ్ల ద్వారా బియ్యం నింపి వారికి సముద్రం ద్వారా నార్త్ కొరియాకి అతను పంపిస్తున్నాడు.దీంతో అతను వారి ఆకలిని తీర్చిన వాడయ్యాడు. అయితే దీన్ని సౌత్ కొరియా ఆక్షేపించింది. న్యాయస్థానం ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో మళ్లీ అతను బాటిళ్ల ద్వారా బియ్యం నింపి సముద్ర మార్గం ద్వారా వారికి పంపించడం మొదలుపెట్టాడు.సౌత్ కొరియాకు చెందిన సీయోమోడో ద్వీపంలో సముద్ర తీరంలో ఉన్న పార్క్ జంగ్ ఓ బాటిల్ లో బియ్యం నింపి సముద్రంలో పడేస్తాడు. దీంతో అది అలల తాకిడికి నార్త్ కొరియా చేరుతుంది. అక్కడ వారి ఆకలిని తీర్చేందుకు అతను ఎంచుకున్న మార్గం ఇది. ఇలా అతను తన ప్రస్థానంని కొనసాగిస్తున్నాడు. పార్క్ 26 సంవత్సరాల క్రితం నార్త్ కొరియాను వదిలేసి సౌత్ కొరియాకు వచ్చాడు.నార్త్  కొరియాలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా చనిపోయిన వారే ఎక్కువగా కనిపించేవారు.


దీంతో చలించిన పార్క్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. వారికి ఆహారం అందించేందుకు బియ్యం నింపిన బాటిళ్లని పంపిస్తున్నాడు. పైగా దీన్ని నిరంతర ప్రక్రియగానే కొనసాగిస్తున్నాడు. రెండు వాటర్ బాటిళ్లలో కిలో బియ్యంని అతను పంపిస్తున్నాడు.మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలు ఇంకా కంప్యూటర్లు తదితర వస్తువులను కూడా పంపిస్తుంటాడు. కొన్ని సార్లు ప్రతి బాటిల్ లో ఒక అమెరికా డాలర్ కూడా ఉంచుతాడు. ఇక అది దొరికిన వారు మాత్రం చైనీస్ లేదా ఉత్తర కొరియా కరెన్సీలోకి మార్చుకుంటారు. కరోనా మహమ్మారీ సమయంలో వాటర్ బాటిల్ లోపల పెయిన్ కిల్లర్ మందులు పంపించాడు. ఇలా పార్క్ తన మానవత గుణాన్ని చాటుతున్నాడు.పార్క్ ఇలా కొన్నేళ్ల నుంచి ఆపకుండా అలసిపోకుండా ఒక గోల్ పెట్టుకొని మరీ వెనకడుగు వెయ్యకుండా చేస్తున్నాడు. అసలు తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ దేశ ప్రజల కోసం తాను ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు. వారి సంతోషమే తనకి కావాలని అంటున్నాడు. అయితే పార్క్ చేస్తున్న సేవలకు గుర్తింపు మాత్రం దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: