ఉత్తరాంధ్ర: పాలకొండలో కూటమికి ఓట్లు రాలతాయా?

Purushottham Vinay
ఉత్తరాంధ్ర - పాలకొండ, ఇండియా హెరాల్డ్: ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ జనాలని కోరడం జరిగింది. మండలంలోని గదబవలస, కొత్తవలస, దేవగిరి, పెద్దవంగర, గజిలి, కడగండి, ఓండ్రుజోల గ్రామాల్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌3, జీవో నెంబర్‌ 52లకు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఓటర్లు ఖచ్చితంగా గ్రహించాలన్నారు. గిరిజన సమస్యలు కోసం అసెంబ్లీలో ప్రస్తావించే వ్యక్తిగా తనను గెలిపించాలని కూటమి అభ్యర్థి జయకృష్ణ కోరడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి జయకృష్ణతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సవర తోటముఖలింగం, సీనియర్‌ నాయకులు నిమ్మక నాగేశ్వరరావు, నిమ్మక చం ద్రశేఖర్‌, ప్రచారకర్త తోయక సంధ్యారాణి, నిమ్మక మురళి ఇంకా కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ గత ఐదు సంత్సరాల నుంచి కూడా పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదం లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.


ఇక మండలంలోని దేవనాపురం, వేంపల గూడ, రేగులగూడ, పాత ఈతమానుగూడ, కొత్తగూడ, ఇప్పగూడ, ముకుందాపురం, కల్లంగూడ, ఆనపకాయలగూడ అలాగే పులిపుట్టి గ్రామాల్లో ఆయన  ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేసి, గెలిపించాలని ప్రజలని కోరారు.ఈ ప్రచారంలో కూటమి నాయకులు సవరతోట ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.చిట్టిపుడివలస సర్పంచ్‌ కుంబిడి పాపమ్మ, ఎంపీటీసీ విశాలాక్షి, పది మంది వార్డు మెంబర్లతో పాటు పలు కుటుంబాలు కూడా జనసేన పార్టీలో చేరాయి. వీరిని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ చేరికల్లో ఉదయాన ఉదయ్‌భాస్కర్‌, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, బల్లా హరిబాబు ఇంకా అనీల్‌ బాబు తదితరులు ఉన్నారు. పాలకొండలో వైసీపీ చేసిన అభివృద్ధి అంతగా లేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని కూటమి ప్రచారం చేసింది. మరి పాలకొండ నియోజకవర్గంలో జయకృష్ణ గెలిచి కూటమిని నిలబెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: