బాలయ్య, బాబి సినిమాలో ఊహించని ట్విస్ట్.. వెన్నుపోటు తప్పదా..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్య ప్రస్తుతం ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ అవుట్ ఫుట్ మాత్రం అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తుంది ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు

 వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోకి వెన్నుపోటు పొడిచే పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్ ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకునిగా , నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్నారు. నటుడిగా సైతం వరుస ఆఫర్లను అందుకుంటూ గౌతమ్ మీనన్ ఆకట్టుకుంటున్నారు. గౌతమ్ మీనన్ తన సినీ కెరీర్ లో క్లాస్ కథలలో ఎక్కువగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ మూవీ నుంచి ఇప్పటికే

 విడుదలైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇతర భాషల్లో సైతం విడుదల కానుండటం ఈ సినిమాకు ఎంతో ప్లస్ కానుందని చెప్పవచ్చు. బాలయ్య కెరీర్ పరంగా టాప్ లో ఉండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బాలయ్య త్వరలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.. బాలయ్య 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ పరంగా సరైన దారిలో వెళ్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య బాబీ కాంబో సినిమాలో బాలయ్య అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: