టీచర్ల ప్రమోషన్లకి ఇబ్బందిగా మారిన టెట్?

Purushottham Vinay
హైదరాబాద్, పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రభుత్వం ప్రమోషన్లు కల్పిస్తుందని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు టెట్ అనేది ఇబ్బందిగా మారింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను ఫాలో అయ్యి టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రమోషన్లకు అర్హులు అన్న నిబంధన ఉపాధ్యాయుల పదోన్నతుల ఆశలపై నీళ్లు చల్లుతుంది.మిగతా ప్రభుత్వ ఉద్యోగులు క్రమంగా పదోన్నతులు పొందుతూ ఉన్నత స్థానాలకు చేరుతుంటే టీచర్లు మాత్రం కోర్టు కేసుల నేపథ్యంలో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి పదోన్నతి లేక ఉన్న కేడర్లోనే పదవీ విరమణ చేస్తుండడం నిజంగా చాలా విచారకరం. పై కేడర్ ప్రమోషన్కు సంబంధించిన అన్ని అర్హతలు ఉన్నా కానీ దశాబ్దంపైగా జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, ఎంఈఓ, డిప్యూటీ ఈవో వంటి తదితర పోస్టులతో పాటు పాఠశాల స్థాయి హెచ్ఎం ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ప్రమోషన్లు పొందలేకపోవడం శోచనీయంగా మారింది.


ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉండి ఇంచార్జీల పాలనలో స్కూల్స్ నడవడం ఇంకా సబ్జెక్టు టీచర్ల కొరత ఉండడం వల్ల పిల్లలు ఆ సబ్జెక్టులలో బోధన అందకపోవడం వంటి బోధనాపరమైన సమస్యలతో స్కూల్ విద్య తగ్గిపోతుంది.హైస్కూల్ స్థాయి పోస్టుల దాకా మేనేజ్ మెంట్ వారీగా పదోన్నతులు ఇవ్వడానికి, బదిలీలు నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇక ఎనిమిది సంవత్సరాల తరువాత గత ఏడాది ఆగస్టు నెలలో ప్రభుత్వం పదోన్నతులకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. జోన్--1లో ప్రధానోపాధ్యాయులు ఇంకా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ దాకా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం కోర్టు కేసుల మూలంగా జోన్--2లో పదోన్నతుల ప్రక్రియను నిలిపివేయడం జరిగింది. పైగా న్యాయస్థానం నుంచి కూడా పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రభుత్వం ఎన్నికల తదుపరి పదోన్నతులు కల్పిస్తుంది అనుకుంటే ఇప్పుడు టెట్ అనేది అడ్డంకిగా మారింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే ప్రతివారు కూడా టెట్ అర్హత సాధించాలని నిబంధనను 2010 వ సంవత్సరంలో విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TET

సంబంధిత వార్తలు: