ఉత్తరాంధ్ర: అక్కడ హ్యాట్రిక్ పై వైసీపీ గురి.. కష్టమే?

Purushottham Vinay
•శ్రీకాకుళం పాతపట్నంలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని భావిస్తోన్న వైసీపీ

•ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన వైసీపీ

•పాతపట్నంలో వైసీపీకి ఈసారి ఓటమి తప్పేలా లేదు


ఉత్తరాంధ్ర, ఇండియా హెరాల్డ్: శ్రీకాకుళం పాతపట్నంలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వైసీపీ తరపున రెడ్డి శాంతి గెలిచారు. టీడీపీ టీడీపీ అభ్యర్థి వెంకటరమణపై 15,551ఓట్లతో గెలవడం జరిగింది.2014 ఎన్నికలలో రెడ్డి శాంతి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2014లో పాతపట్నం నుంచి వైసీపీ తరపున గెలిచిన కలమట వెంకటరమణ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.


అయితే వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత వంశధార రిజర్వాయర్ నిర్మాణంలో నష్టపోయినవారికి 2013వ భూ సేకరణ చట్టం అమలు చేసి న్యాయం చేస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా కానీ 2013 భూ సేకరణ చట్టం అమలు కాలేదు. పెంచిన పరిహారం కేవలం కొంతమందికే ఇచ్చారు. మెళియాపుట్టిలో మహిళా జూనియర్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు. ఇది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. పెద్దమడి కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసి, గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నా కూడా అది నెరవేరలేదు.అలాగే పాతపట్నం నియోజకవర్గంలోని పలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు, తారు రోడ్లు వేస్తామన్న హామీ నెరవేరలేదు. కొన్ని చోట్ల గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు అరకొరగా చేసి, అక్కడితోనే నిలిపివేయడం జరిగింది.


ఇక కొత్తూరులో రైతు బజారు ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు.వైసీపీ హామీలో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం మంజూరు చేస్తామన్నా అది నెరవేరలేదు. అలాగే వంశధార ప్రాజెక్టు పనులు పూర్తిచేసి, సాగునీటిని అందిస్తామన్నారు. ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తయ్యాయి, మిగిలినవి ఇంకా సాగుతూనే ఉన్నాయి. నాగావళి, వంశధార అనుసంధానం కూడా జరగలేదు. వంశధార నదికి కొత్తూరు మండలంలో కరకట్టల నిర్మాణం చేపడతామన్నా పనులు మొదలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేరవేర్చని హామీలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈసారి గెలవడం కష్టమే.పాతపట్నంలో తాజాగా ఎన్నికల్లో రెడ్డిశాంతికి పోటీగా టీడీపీ తరపున మామిడి గోవిందరావు పోటీ చేస్తున్నారు. మరి ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: