ఏపీలో కాపు Vs కాపు రాజ‌కీయం... 16 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ప‌క్కా వాళ్ల‌వే..?

RAMAKRISHNA S.S.
- మూడు పార్ల‌మెంటు, 16 అసెంబ్లీ సీట్ల‌లో కాపులే ప్ర‌త్య‌ర్థులు
- గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లో మెజార్టీ సీట్ల‌లో వాళ్లే పోటీ
- జ‌న‌సేన నుంచి ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చిన ప‌వ‌న్‌
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కాపుల జ‌నాభా ఎంతో కీలకం... జ‌నాభాలో మెజార్టీ కాపులే ఉంటారు. ఇక ఉత్త‌రాంధ్ర‌లో ఈ సామాజిక వ‌ర్గాన్ని తూర్పు కాపులు అని పిలిస్తే.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఒంట‌ర్లు, ఇక గోదావ‌రి జిల్లాల్లో కాపులు అని పిలిస్తే... సీమ జిల్లాల్లో బ‌లిజ‌లు అని పిలుస్తూ ఉంటారు. పేర్లు ఏవైనా వీరంతా కాపులే.. జ‌నాభాలో దాదాపు 23 % ఈ సామాజిక వ‌ర్గం వారే ఓట‌ర్లుగా ఉంటారు. వీరికి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్యాధికారం లేక‌పోయినా మెజార్టీ సీట్ల‌లో గెలుపు ఓట‌ముల‌ను వీరే నిర్ణ‌యిస్తారు. చాలా సీట్ల‌లో వీరిదే డామినేష‌న్‌. ఏపీలో అటు కూట‌మి, ఇటు వైసీపీ రెండు వైపులా ఎంపీ, ఎమ్మెల్యేలుగా కాపుల‌ను నిల‌బెట్టిన స్థానాల వివ‌రాలు ఇండియా హెరాల్డ్ మీకోసం ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

పార్ల‌మెంటు స్థానాలు
1) కాకినాడ : తంగెళ్ల ఉద‌య్ శ్రీనివాస్ ( జ‌న‌సేన‌) - చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ ( వైసీపీ)
2) మ‌చిలీప‌ట్నం:  వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ( జ‌న‌సేన ) - సింహాద్రి చంద్ర‌శేఖ‌ర్ ( వైసీపీ )
3) విజ‌య‌న‌గ‌రం: క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు ( టీడీపీ) - బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ ( వైసీపీ)

అసెంబ్లీ స్థానాలు
1) రాజాన‌గ‌రం: బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ ( జ‌న‌సేన‌) - జ‌క్కంపూడి రాజా ( వైసీపీ)
2) నిడ‌ద‌వోలు: కందుల దుర్గేష్ ( జ‌న‌సేన‌) - జి. శ్రీనివాసుల నాయుడు ( వైసీపీ)
3) అవ‌నిగ‌డ్డ‌:  మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ( జ‌న‌సేన‌) - సింహాద్రి ర‌మేష్ ( వైసీపీ)
4) పాత‌ప‌ట్నం:  మామిడి గోవింద‌రావు ( టీడీపీ) - రెడ్డి శాంతి ( వైసీపీ)  - ఇద్ద‌రు తూర్పు కాపులే
5) భీమిలి:  గంటా శ్రీనివాస‌రావు ( టీడీపీ) - ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు ( వైసీపీ)
6) చీపురుప‌ల్లి: క‌ళా వెంక‌ట్రావు ( టీడీపీ) - బొత్స స‌త్య‌నారాయ‌ణ ( వైసీపీ) - ఇద్ద‌రు తూర్పు కాపులే
7) గ‌జ‌ప‌తిన‌గ‌రం: కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ( టీడీపీ) - బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య ( వైసీపీ) - ఇద్ద‌రు తూర్పు కాపులే

8) భీమ‌వ‌రం:  పుల‌ప‌ర్తి అంజిబాబు ( జ‌న‌సేన‌) - గ్రంధి శ్రీనివాస్ ( వైసీపీ)
9) తాడేప‌ల్లిగూడెం:  బొలిశెట్టి శ్రీనివాస్ ( జ‌న‌సేన‌) - కొట్టు స‌త్య‌నారాయ‌ణ ( వైసీపీ)
10) ప్ర‌త్తిపాడు: వ‌రుపుల స‌త్య‌ప్ర‌భ ( టీడీపీ) - వ‌రుపుల సుబ్బారావు ( వైసీపీ)
11) పిఠాపురం: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ( జ‌న‌సేన‌) - వంగా గీత ( వైసీపీ)
12) కాకినాడ రూర‌ల్‌: పంతం నానాజీ ( జ‌న‌సేన‌) - కుర‌సాల క‌న్న‌బాబు ( వైసీపీ)
13) పెద్దాపురం: నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ( టీడీపీ) - ద‌వులూరి దొర‌బాబు ( వైసీపీ)
14) జ‌గ్గంపేట‌: జ్యోతుల నెహ్రూ ( టీడీపీ) - తోట న‌ర‌సింహం ( వైసీపీ)
15) ఏలూరు: బ‌డేటి రాధాకృష్ణ ( టీడీపీ) - ఆళ్ల నాని ( వైసీపీ)
16) స‌త్తెన‌ప‌ల్లి: క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ( టీడీపీ) - అంబ‌టి రాంబాబు ( వైసీపీ)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: