ఈరోజు తెలుగు మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , నాచురల్ స్టార్ నాని , విజయ్ దేవరకొండ , సుహాస్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం విరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అని వివరాలను తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం నానక్ రామ్ గూడ లో నాన్ లీడ్ యాక్టర్స్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాన్ని నాని పై ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేయకపోవడంతో వీడి 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా యొక్క షూటింగ్ ను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ మరియు కొంత మంది ఇతరులపై ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న సుహాస్ ప్రస్తుతం ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుహాస్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాను షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: