కలలాంధ్ర: విశాఖ రాజధాని అయితే..?

Divya
•అందుకే విశాఖ రాజధాని
•వాటితో పోటీ పడడమే ప్రధాన లక్ష్యం
•అమరావతి రాజధాని కాకపోవడానికి కారణం అదే
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్.. 2019 ఎన్నికల తర్వాత మూడు రాజధానులంటూ తెరపైకి వచ్చినా.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.. అయితే ఈసారి వైసిపి అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచి పరిపాలన చేపడతాము అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా మారుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా ఉంది..  కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి  రాజధాని నిర్ణయించాల్సి ఉండగా.. అటు అమరావతి ఇటు విశాఖపట్నం అంటూ ఎప్పటినుంచో పోటాపోటీగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే . కానీ ఈ నేపథ్యంలోనే వైసిపి అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధానిగా మారుతుందని... ఒకవేళ కూటమి ( టిడిపి,  బిజెపి, జనసేన) అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుందని చెబుతున్నారు..
ఇప్పుడు అన్ని సర్వేలు చెబుతున్న విషయం బట్టి చూస్తే మళ్లీ అధికారంలోకి వైసిపి పార్టీ రాబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎం గా గద్దెనెక్కితే ఆయన విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడతారు. మరి విశాఖ నే ఎందుకు రాజధానిగా ఎంచుకున్నారు అనే విషయానికి వస్తే.. అమరావతి అనేది గుంటూరులో లేదు.. అటు విజయవాడలో లేదు.. గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో.. ఇటు విజయవాడకూ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.. పైగా అమరావతి మొత్తం బీడు భూములే ఉన్నాయి ..అక్కడ బిల్డింగులు కట్టడం మాట అటుంచితే కనీసం నీటి సరఫరా,  డ్రైనేజ్, విద్యుత్తు లాంటివి కూడా నిర్మించలేని పరిస్థితి.. ఇక బీడు భూముల్లో ఏదైనా కట్టాలి అంటే దానికి ఖర్చు రెట్టింపు అవుతుంది. ఇక మరొకవైపు అమరావతిని రాజధానిగా చేసి డబ్బులు వెచ్చించి ఏదైనా నిర్మించాలి అనుకున్నా కూడా సంవత్సరాలు సమయం పడుతుంది.. దీనికి తోడు లక్షలాది కోట్లు ఖర్చు చేయాలి..
ఇక ఇప్పుడు అన్ని అనుకూలాలున్న వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తే పెద్దగా ఖర్చు ఉండదు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే వైజాగ్ అతిపెద్ద నగరం.. ఆల్రెడీ డెవలప్ అయిన ప్రదేశాన్ని మరింత డెవలప్ చేసి రాజధానిగా ప్రకటిస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఆ వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ , చెన్నై వంటి మహానగరాలతో పోటీ పడడానికే ఇప్పుడు వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.. ఇప్పటికే ఎయిర్పోర్టు తో సహా అన్ని సౌకర్యాలు వైజాగ్ లో ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు , హైదరాబాద్ వంటి నగరాలతో పోటీపడుతూ అటు యువతకు ఇటు ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు కల్పించే విధంగా వైజాగ్ ను రూపుదిద్దుతామని.. వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం వైపు వెళుతుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: