ఏపీ: మారింది మోదీ కాదు.. ఎల్లో మీడియాయేనా?
ఏపీలో రైల్వేల మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రాజెక్టులకు ఈ ఏడాది రూ.9151 కోట్లను కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.2047 కోట్లను కేంద్రం కేటాయించింది. ఉమ్మడి ఏపీలో 2009-14 లో మధ్య ఐదేళ్ల సగటున రూ.886 కోట్లు కేటాయించగా.. తాము ఈ ఒక్క ఏడాదే విభజిత ఏపీకి అంతకు పది రెట్లు పైగా నిధులు కేటాయించామని వివరించారు.
అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే.. మోదీ ప్రభుత్వం గతంలోను ఏపీకి భారీగానే రైల్వే నిధులను కేటాయించింది. కాకపోతే ఎల్లో మీడియా అతి ఉత్సాహం వల్ల.. మొత్తం చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది అనే తరహాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వాస్తవాలు పరిశీలిస్తే.. గత బడ్జెట్ లో ఏపీకి కేంద్రం రూ.9,138 కోట్లను కేటాయించింది.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 1 2023-24 రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధులు రూ.9138 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ఏడాది ప్రకటించినవి రూ.9151 కోట్లు. అంతే కేవలం పెరిగింది రూ.20 కోట్లు మాత్రమే. కానీ ఇక్కడ ప్రచారం మాత్రం ఇప్పుడు గణనీయంగా వస్తోంది. ఏపీకి కేంద్రం నిధులు వరద పారిస్తోంది అనే తరహాలో వార్తలు రాసుకొస్తున్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏం సాధించారు అని ప్రశ్నించి.. కేంద్రం నిధులను తక్కువ చేసిన చూపిన పత్రికలే నేడు మోదీని ఆకాశానికెత్తుతున్నాయి.