రామ్ ఎన్ఆర్ఐ మూవీ రివ్యూ!

Anilkumar
బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా అలీ రేజా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలీ రేజా హీరోగా రామ్ ఎన్.ఆర్.ఐ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఈరోజు డీసెంట్ బజ్ తో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మువ్వా క్రియేషన్స్, ఎస్.ఎం.కే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించగా మువ్వా సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సింగలూరి మోహనకృష్ణ ఈ సినిమాకు సమర్పకుడు కాగా ఈరోజు ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమాకు చెప్పుకోదగ్గర స్థాయిలో థియేటర్లు లభించాయి.
 
కథ :
 
శ్రీనివాస్ (మువ్వా సత్యనారాయణ), సనా దంపతుల ఏకైక కుమారుడైన రామ్ (అలీ రేజా) తల్లీదండ్రులు ఇతర కార్యక్రమాలతో ఎపుడూబిజీగా ఉండటంతో ఒంటరిగా ఫీలవుతూ ఉంటాడు. అతని తల్లీదండ్రులు అమెరికాలో విశ్వభారతి పేరుతో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. తల్లీదండ్రులు తనతో ఎక్కువ సమయం గడపడం లేదని ఫీలైన రామ్ తన గ్రాండ్ పేరెంట్స్ తో గడపడానికి ఇండియా వెళ్తాడు.
 
ఇండియా వెళ్లిన రామ్ అక్కడ శ్రావణి (సీతా నారాయణన్) తో ప్రేమలో పడతాడు. అయితే రామ్ గ్రాండ్ పేరెంట్స్ నివశించే గ్రామంలో రామ్ కు తన తండ్రి గురించి, తాతయ్య గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు తెలిసిన తర్వాత రామ్ ఏం చేశాడు? తనకు ఎదురైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
నటీనటుల పనితీరు :
 
సినిమాలో ఎన్నారై పాత్రలో అలీ రేజా అద్భుతంగా నటించాడు. గత సినిమాలతో పోల్చి చూస్తే అలీ రేజా యాక్టింగ్ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్ సీతా నారయణన్ పాత్ర పరిధి మేర బాగానే నటించి తన నటనతో మెప్పించారు. గ్రాండ్ పేరెంట్స్ పాత్రల్లో నటించిన విజయ్ చందర్, గీతాంజలి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఆ పాత్రలకు వాళ్లు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.
సాంకేతిక వర్గం పనితీరు :
 
డైరెక్టర్ లక్ష్మీ నంద అద్భుతమైన మెసేజ్ తో సినిమాను తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. ఈ వీకెండ్ కు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు రామ్ ఎన్ఆర్ఐ మంచి ఆప్షన్ అనే అభిప్రాయాన్ని కలిగించారు. కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. మువ్వా క్రియేషన్స్, ఎస్.ఎం.కే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రవణ్ మ్యూజిక్, బీజీఎంకు తన పరిధి మేర న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
 
ప్లస్ పాయింట్స్ :
 
అలీ రేజా, విజయ్ చందర్ మధ్య ఎమోషనల్ సీన్స్
 
ఫస్టాఫ్ లోని ప్రేమ సన్నివేశాలు
 
ప్రీ ఇంటర్వెల్
 
మైనస్ పాయింట్స్ :
 
సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు
 
ప్రేక్షకుల ఊహలకు అందేలా కొన్ని సన్నివేశాలు ఉండటం
 
రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: