నాని 'హిట్ 3' లో భయంకరమైన విలన్ గా ఆ స్టార్ హీరో..?

murali krishna
నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ‘స‌రిపోదా శ‌నివారం’ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమా త‌రువాత నాని త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.ఇప్ప‌టికే శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ ఫ్రాంచైజీ మూవీ ‘హిట్-3’ని లైన్ లో పెట్టిన నాని, ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీంతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లోనూ ఓ సినిమాను చేయ‌నున్నాడు. అయితే, హిట్ 3 సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నాని.. అనుకోకుండా హీరోగా మారాడు. అయితే భవిషత్తులో కుదిరితే దర్శకుడిగా మారతాను అంటూ నాని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే దర్శకుడిగా కాకుండా, రైటర్ గా భాద్యతలు తీసుకోబోతున్నారట. హిట్ 3 కోసం నాని పెన్ పట్టుకొని కథని రాయబోతున్నారట. హిట్ 3 కోసం నాని ఓ స్టోరీ లైన్ అనుకున్నారట. ఇప్పుడు ఆ స్టోరీ లైన్ శైలేష్ కొలను డెవలప్ చేసే పనుల్లో ఉన్నారట.నాని అనుకున్న ఈ స్టోరీ లైన్ లో ఓ భయంకరమైన విలన్ ఉన్నాడట. ఇక ఆ విలన్ గా రానాని అనుకుంటున్నారట నాని. టాలీవుడ్ లో నాని అండ్ రానా మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. రానా తనని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడని నాని ఎప్పుడు చెప్పుకొస్తుంటారు. ఇప్పుడు అదే స్నేహంతోనే నానికి విలన్ గా చేసేందుకు కూడా రానా సై అనే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.నాని, రానాల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. దీంతో నాని సినిమాలో విలన్ పాత్ర‌లో న‌టించేందుకు రానా ఓకే చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ వార్త‌ల‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తరువాత నాని లైనప్ లో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సినిమా, శైలేష్ కొలనుతో హిట్ 3 ఉన్నాయి.దీంతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లోనూ ఓ సినిమాను చేయ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: