జగన్‌ టైమ్‌లో అంత అరాచకం జరిగిందా.. ఇవిగో అసలు లెక్కలు?

ఏపీలో శాంతి భద్రతలపై కొద్ది రోజులుగా అధికార కూటమి నేతలు, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ దిల్లీకి వెళ్లిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు.

ఇలా ఏపీలో ప్రస్తుత శాంతి భద్రతలపై చర్చ జరుగుతున్న వేళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన శాంతి భద్రతలపైనే శ్వేత పత్రం విడుదల చేయడంతో రాజకీయం రంజుగా మారింది.  ఈ సందర్భంగా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో జగన్ పాలనలో శాంతి భద్రతలు అత్యంత దయనీయ పరిస్థితికి చేరాయని విమర్శించారు.

గతంలో తన హయాంలో జరిగిన శాంతి భద్రతల గురించి వివరించారు. అయితే శ్వేత పత్రం విడుదల చేసే సమయంలో కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి.  వాటిని ఆయన ఎలా అదుపులోకి తీసుకువచ్చారు అనేది ఉండాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏమేర పాలించారో ఉండాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా జగన్ హయాంలో జరిగిన అల్లర్లు, కేసులు గురించి మాత్రమే ప్రస్తావించారు.

దీనిపై వైసీపీ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. 2014-19లో టీడీపీ హయాంలో 4928 హత్యలు జరిగాయని, వైసీపీ పాలనలో 3588, క్షణికావేశంలో చేసిన హత్యలు టీడీపీ హయాంలో 560, వైసీపీ అప్పుడు 455, ఘర్షణలు టీడీపీ ఉన్నప్పుడు 3022, వైసీపీ 2069, కిడ్నాప్ లు 5263 టీడీపీ పాలనలో… 4026 వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి.  85158 దాడులు చంద్రబాబు అధికారంలో ఉండగా జరగ్గా.. జగన్ సమయంలో 72393 దాడులు జరిగాయి. హత్యాయత్నాలు టీడీపీ 9654,  వైసీపీ 6091, అత్యాచారాలు టీడీపీ 130, వైసీపీ 101, దోపిడీ హత్యలు టీడీపీ 229, వైసీపీ 160 లు జరిగినట్లు  లెక్కలతో సహా వివరించారు.

పగటి పూట ఇళ్ల దొంగతనాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3883, వైసీపీ హయాంలో 2842, రాత్రిపూట దొంగతనాలు టీడీపీ 15825, వైసీపీ 11894, దొంగతనాలు టీడీపీ ఉన్నప్పుడు 70125, వైసీపీ పాలనలో 51546 జరిగాయని.. లెక్కలతో సహా వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: