రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా బాబు ఎందుకు దాటవేస్తున్నట్టు?

Purushottham Vinay

• రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదా? 

• సూపర్ సిక్స్ హామీల సంగతి ఏంటి? 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: ఎంతసేపు గత వైసీపీ పాలన గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తప్పిదాల గురించి ప్రచారం చెయ్యడమే తప్ప నిర్మాణాత్మక వైఖరిని చెప్పడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయట్లేదు బాబు గారు. అసలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రతి రోజూ జగన్ పై చంద్రబాబు చేసే విమర్శలు, ఆరోపణలే హైలెట్ అవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే వాటిని ఎలా అమలు చేసేది ఇంకా చంద్రబాబు నాయుడు వివరించలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి కచ్చితంగా ప్రజలు సహకరించాలని గవర్నర్‌తో చెప్పించారు. అంటే దాని అర్థం హామీలు కొన్నింటిని మర్చిపోండని, లేదా ప్రజలే తమకు ఆ హామీలు వద్దు అని చెప్పాలన్నదే లక్ష్యం అని చంద్రబాబు నాయుడు మాటల ద్వారా అర్థం అవుతూనే ఉంది. ఇక చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారు? ఇప్పుడు ఎలా మాట మార్చారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని తెలుస్తుంది.12 నెలల కాల వ్యవధిలో 7నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టే పరిస్థితిలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. 


రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని నెట్టింటా కామెంట్స్ వినిపిస్తున్నాయి.రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెడితే ఎన్నికల్లో ఇచ్చి మోసపూరిత హామీలకు కేటాయింపులు రెగ్యులర్ బడ్జెట్‌లో చూపించాల్సి వస్తుందనే వాదన బలంగా వినిపిస్తుంది. అసలు రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు నాయుడు దాటవేస్తున్నారని ఆరోపిణలు వస్తున్నాయి.రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశపెడితే పథకాలు, మ్యానిఫెస్టోలకు సంబంధించిన హామీలు ఇంకా అలాగే ఆ పథకాల డబ్బులు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటారని, అవన్నీ మోసపూరిత హామీలుగా ప్రజలకు తెలిసిపోతుందని భావించి చంద్రబాబు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదా? అనే కామెంట్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఏదంటే అదే అన్నట్టుగా ఉండడం కూడా ఏమాత్రం బాగాలేదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: