టీవీ: బిగ్ బాస్ -8 లోకి వైజాగ్ బ్యూటీ.. ఎవరంటే..?
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా వైజాగ్ కు చెందిన ఒక అమ్మాయి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ -8 లోకి రేఖా భోజ్ సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈమె అసలు పేరు శ్రీ సుష్మ.. ఇమే మాంగల్యం, రంగీలా, దామిని విల్లా తదితర చిత్రాలలో కూడా నటించిందట. ప్రస్తుతం ఈమె వైజాగ్ లోనే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సొంతంగా ఒక స్టూడియో పెట్టుకుని పది రకాల ఆల్బమ్స్ సాంగులను కూడా చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది.
ఈ మధ్యనే టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిస్తే విశాఖ బీచ్ లో కూడా స్ట్రిక్కింగ్ చేస్తానంటూ ఒక ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక పవన్ కళ్యాణ్ కు కూడా వీర అభిమానిగా ఉన్న రేఖ అసెంబ్లీ ఎన్నికలలో కూడా జనసేన తరఫున ప్రచారంలో భాగంగా తన వంతు కృషి చేసింది. అలా పవన్ అభిమానులకు కూడా ఈ ముద్దుగుమ్మ కాస్త చేరువయ్యింది. మరి రేఖా బోజ్ హౌస్ లోకి కంటిస్టెంట్ గా అవకాశం దక్కించుకుంటుందో లేదో చూడాలి..