ఆ హీరో వల్లే నా లవ్ బ్రేక్ అప్ అయ్యింది.. మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్..!
“తను ఒక స్టార్ హీరో సరసన నటిస్తోంది… నేను ఎక్కడ వెనుకబడిపోతానో?” అనే భావన అతనిలో బలంగా ముదిరిపోయిందని ఆమె పేర్కొంది. ఆ ఆలోచన అతనిని మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేసిందని తెలిపింది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో, మృణాల్ ప్రియుడు జిమ్లో కఠినంగా శ్రమించడం ప్రారంభించాడని ఆమె వివరించింది. కేవలం కొద్ది కాలంలోనే దాదాపు 20 కిలోల బరువు తగ్గేంతగా అతను శారీరక శ్రమ చేశాడని చెప్పింది. అయితే ఆ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఫిట్నెస్పై ఆసక్తి కాదని, తనను ఇతరులతో పోల్చుకోవడం వల్ల వచ్చిన ఒత్తిడేనని మృణాల్ చెప్పింది.అయితే ఈ మార్పు ఎక్కువ కాలం నిలబడలేదని ఆమె తెలిపింది. కొంతకాలానికే అతను మళ్లీ బరువు పెరగడం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. “ఇలా ఎందుకు చేస్తున్నావు?” అని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానం తనను ఎంతగానో కలచివేసిందని మృణాల్ వెల్లడించింది. “నీ చుట్టూ ఉన్న సినీ స్టార్లతో నేను పోటీ పడాలని అనుకున్నాను. వాళ్లలా మారాలని ప్రయత్నించాను. కానీ అది నా వల్ల కాలేదు. అందుకే జిమ్ మానేశాను” అని అతను నిరాశగా చెప్పాడని ఆమె తెలిపింది.
అందం, ఫిట్నెస్ వంటి విషయాల్లో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక వేదనకు దారితీస్తుందో తాను తన కళ్లారా చూశానని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో ఉన్న సంబంధంలో తాను ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో ఉన్నప్పటికీ, అతను తనను తాను ఇతరులతో పోల్చుకోవడం ఆ బంధాన్ని దెబ్బతీసిందని చెప్పింది. వ్యక్తిగత అస్థిరతలు, తక్కువతనం భావనలు ఒక బంధాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని ఆమె సూచించింది. ఈ అనుభవం తనకు జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని మృణాల్ చెప్పింది. సంబంధం అనేది పరస్పర విశ్వాసం, ఆత్మవిశ్వాసం, పరస్పర గౌరవం మీద ఆధారపడాలని ఆమె అభిప్రాయపడింది. ఒకరు ఎదుగుతున్నప్పుడు మరొకరు ప్రోత్సహించాలి గానీ, పోలికలతో బాధపడకూడదని ఆమె సూచించింది. ఇతరులతో పోల్చుకోవడం కన్నా, మనలోని ప్రత్యేకతను గుర్తించి దానిని మెరుగుపరచుకోవడం ముఖ్యం అని చెప్పింది.