కలలాంధ్ర: ఎడ్యుకేషన్ హబ్ అయితే మిగతా రాష్ట్రాలు వణకాల్సిందే?

Purushottham Vinay
•ఆంధ్ర రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్ అయితే మరో జపాన్ అవ్వడం పక్కా

•పరిశ్రమలకు తగ్గట్లు నాణ్యమైన కోర్సులు ఫ్రీగా అందిస్తే రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అవ్వడం పక్కా 


చదువు.. ఒక మనిషికి దీనికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చదువు తలచుకుంటే పేద వాడ్ని ధనవంతుడిగా మార్చగలదు. చదువంటే నాలెడ్జ్ మాత్రమే కాదు మన జీవితాన్ని చక్కగా మలుపుతిప్పే మార్గం. కటిక పేదరికం నుంచి వచ్చిన అంబేద్కర్, అబ్దుల్ కలామ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, స్వామి వివేకానంద వంటి మహానుభావులు ఇంత గొప్ప వారు అయ్యారంటే దానికి ప్రధాన కారణం వారి చదువే. చదువనేది కేవలం బ్రతకడానికి ఆదరవు మాత్రమే కాదు. చదువు ఒక మనిషిని మహర్షిలా తీర్చి దిద్దే ఆయుధం. ఈ ఆయుధాన్ని సరిగ్గా వాడితే దేశంలో పేదవాడంటూ ఉండడు. మన ఆంధ్ర రాష్ట్రం మంచి ఎడ్యుకేషన్ హబ్ అయితే ఎలా ఉంటుందో.. యువత ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..యువత నిరుద్యోగిగా మారకూడదంటే ఎడ్యుకేషన్ సిస్టం మారాలి. ఎందుకంటే మన చేతి వేళ్ళు ఒకే విధంగా లేనట్టే  ఒకే విధంగా చదువుకోలేరు. ఆంధ్రాలో నిరుద్యోగి సమస్య తీరాలంటే పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆ పరిశ్రమలు కూడా పొరుగు దేశం వాడి స్వలాభం కోసం కాకుండా మన దేశానికి మన ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. 


అలాంటి పరిశ్రమలని పెట్టి వాటికి అనుగుణంగా కోర్సులు పెట్టి విద్యార్థులని ఎల్లప్పుడూ చైతన్య పరిస్తే రాష్ట్రంలో నిరుద్యోగి అంటూ ఉండడు. గవర్నమెంట్ ఉద్యోగులకు ధీటుగా ప్రైవేట్ ఉద్యోగులకు కూడా మంచి జీతాలు ఇస్తే రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం లేనట్టే. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు అనుగుణంగా ఎలాంటి ఫీజు లేకుండా నాణ్యమైన స్కిల్‌ డెవలప్మెంట్‌ హబ్, జిల్లా కేంద్రంలో స్కిల్‌ కాలేజ్, ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పితే మన రాష్ట్రం పక్కాగా జపాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల లాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. నిజానికి రాష్ట్రం బాగుపడాలంటే రాజకీయ నాయకులు వివిధ పథకాలు ప్రవేశపెట్టాల్సిన పనిలేదు. పేదవాడికి ఫ్రీగా నాణ్యమైన విద్య, వైద్యం, రేషన్, ఇళ్ళు.. ఈ నాలుగు ఇస్తే చాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక్క పేద వాడు ఉండడు. చైనా, ఇజ్రాయెల్, జపాన్ లాంటి దేశాల్లో ఇవే పద్ధతులు అమలు చేస్తాయి కాబట్టే ఆ దేశాలు నేడు ఇంత అభివృద్ధి చెందాయి. ఫ్రీగా పిచ్చి పిచ్చి పథకాలు పెట్టె బదులు ఇలా ఫ్రీగా పిల్లలకు నాణ్యమైన చదువుని అందించి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారిస్తే దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని హేళన చేసే పలు రాష్ట్రాలు గజ గజ వణికిపోవాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: