తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు భలే గుడ్‌న్యూస్‌..?

Chakravarthi Kalyan
ఈ లర్నింగ్ ద్వారా దాదాపు దశాబ్ద కాలంగా విద్యార్థులకు చేరువైన సంస్థ వేదాంతు. ఈ సంస్థ ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు సేవలు అందిస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు  ఆఫ్ లైన్ కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదాంతు ప్రకటన చేసింది. వేదాంతు సహ వ్యవస్థాపకులు, వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో ఏపీ, తెలంగాణల్లో దాదాపు పది ఆఫ్ లైన్ కోచింగ్ కేంద్రాలను ప్రాంభించనున్నట్టు తెలిపారు.

విజ్ఞాన్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ వివరించారు. తొలుత 11,12 తరగతుల వారికి ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్న వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ.. భవిష్యత్తులో 9,10 తరగతుల వారికి సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఒత్తిడి లేకుండా మంచి విద్యను అభ్యసించటమే తమ లక్ష్యమని వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: